
రాజమౌళి తన సినిమాల్లో అడపాదడపా మెరుస్తుంటారు. చిన్న చిన్న సీన్లలో కాసేపు కనిపిస్తుంటారు. సీన్‌ని బట్టి, సిచ్చువేషన్‌ని బట్టి ఆయన తన సినిమాల్లో కనిపిస్తుంటారు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ`లోనూ గెస్ట్ రోల్ చేశారు. భైరవ వెంటపడే పాత్రలో ఆయన తళుక్కున మెరిశారు. ఈ సారి దొరికితే ఐదేళ్లు తొక్కిపడేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇది ఫన్నీగా ఉంటుంది.
అయితే రాజమౌళి 17ఏళ్ల క్రితమే నటుడిగా మారాడు. అంతేకాదు ఆయన హీరోయిన్‌తో రొమాన్స్ కూడా చేశాడు. రేడియో ద్వారా ప్రేమ, ఆ తర్వాత రొమాన్స్. హీరోయిన్‌ని ఆడుకుంటూ అదిరిపోయే రొమాన్స్ తో రెచ్చిపోయాడు. మరి ఆ కథేంటో చూస్తే, ఇప్పుడు జబర్దస్త్ షోకి యాంకర్‌గా రాణిస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంది రష్మి గౌతమ్.
ఆమె జబర్దస్త్ కి రాకముందు పలు సీరియల్స్, సినిమాలు కూడా చేసింది. తాను నటించిన మొదటి సీరియల్ `యువ`. వీటితోపాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో, లేదంటే సైడ్ రోల్స్ చేసింది. అనంతరం జబర్దస్త్ లోకి వచ్చింది. దీని ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది.
మధ్య మధ్యలో సినిమాలు కూడా చేసింది రష్మి. కొన్ని బాగానే ఆడాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇప్పుడు రాజమౌళితో ఆమె రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో రేడియో ద్వారా ఇద్దరు ప్రేమించుకుంటారు.
ఫైనల్‌గా ఇద్దరు కలవాల్సిన సందర్భం వస్తుంది. కలిసే ముందే రాజమౌళిని ఊహించుకుని `విక్రమార్కుడు` సినిమాలోని జింతాకా జింతాక పాటేసుకుని ప్రేమలో మునిగితేలుతుంది రష్మి. కానీ అది డ్రీమ్. ఇంతలోనే రాజమౌళి వస్తారు. కేఫ్‌లో రష్మి ఫ్రెండ్ వెళ్లిపోతుంది.
రాజమౌళిని ఫస్ట్ టైమ్ చూడగానే మెలికలు తిరుగుతుంది రష్మి, ఫస్ట్ క్రష్ లాగా, ఫస్ట్ మీట్‌లో ఆమె చాలా టెన్షన్ పడుతుంది. కానీ రాజమౌళి చాలా కూల్‌గా డీల్ చేస్తుంటాడు. నేను ఇది నమ్మలేకపోతున్నా అని రష్మి అంటే, ఫర్వాలేదు నమ్మొచ్చు అని సింపుల్‌గా చెప్పేస్తాడు రాజమౌళి.
ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నది మీరా? అని అడగ్గా, రోజులు కాదు, గంటలు, అరగంటకోసారైనా మాట్లాడాలి కదా. కుచ్ కుచ్ హోతా హై, నీకు తెలుసు కదా. అవును నేను అంకుల్ అయితే ఏం చేసేదానివి అడుగుతాడు రాజమౌళి, ఆంటీ అయ్యేదాన్ని అని సమాధానం చెబుతుంది రష్మి.
దీనికి దెబ్బకి షాక్ తిన్న జక్కన్న అబ్బా రేడియోలోనే కాదు, బయట కూడా బాగానే మాట్లాడుతున్నావే అంటూ పంచ్ వేస్తాడు. దీనికి ఇంకా బాగా మాట్లాడతా అని చెబుతుంది. అంతటి ఆగలేదు, నాకు సిగ్గేస్తుందంటూ మెలికలు తిరుగుతుంది. నాకు తొందరగా ఉందంటాడు రాజమౌళి.
అప్పుడే వెళ్లాలా అని రష్మి అంటుంది. ఏ వెళ్లనివ్వవా అంటే ఫీలింగ్ షైగా ఉంది అని చెబుతుంది. రాజమౌళి చేయిపై చేయ్యి పెట్టి సిగ్గుపడుతుంది. తెలుస్తూనే ఉందంటూ, చెప్పు అంటాడు ప్రేమగా రాజమౌళి. తప్పదా అంటుంది. తప్పదు అంటాడు.
దీంతో తలసైడ్‌కి తిప్పు కళ్లు మిటమిట కొడుతుంది. ఇది అర్థం కాని రాజమౌళి ఏంటి కళ్లు మండుతున్నాయా? అంటాడు. దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన రష్మి, షటాప్ దాని అర్థం ఐ లవ్యూ, నీకు కూడా తెలియదా? అని కేఫ్‌లో అందరి ముందు గట్టిగా అరుస్తుంది, దెబ్బకి బిత్తరపోయి చూస్తాడు రాజమౌళి.
ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈకళాఖండం ఎక్కడ చోటు చేసుకుంది, ఇదంతా ఎప్పుడు జరిగిందంటున్నారు. అయితే రష్మి ప్రారంభంలో సీరియల్స్ చేసింది కాదా, అందులో `యువ` సీరియల్‌లో వీడియో క్లిప్ ఇక్కడ చూడండి. ఓ సన్నివేశంలో రాజమౌళి కనిపిస్తారని తెలుస్తుంది.
ఇప్పుడు వైరల్ అయ్యేది దానికి సంబంధించిన సీన్ అని తెలుస్తుంది. ఇందులో రాజమౌళి కాసేపు మెరిసినా బాగా చేశాడు. అలాగే రష్మి కూడా రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని అలరిస్తుంది. సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇక రష్మి ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్‌గానే రాణిస్తుంది. రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు మహేష్ బాబుతో గ్లోబల్ ఫిల్మ్ చేస్తున్నారు.
read more: Sai Pallavi: సాయి పల్లవి నేషనల్ అవార్డు కల నెరవేరుతుందా? అమ్మమ్మ పట్టు చీర సెంటిమెంట్