2011లో సుసీంద్రన్ రాసి, దర్శకత్వం వహించిన 'అగై సామియిన్ కుతిరై' .. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో హాస్యనటుడు అప్పుకుట్టిని హీరోగా పెట్టి సుసీంద్రన్ హిట్ ఇచ్చారు.
ఆ తర్వాత, విక్రమ్‌తో 'రాజపాటై' చిత్రానికి దర్శకత్వం వహించి విఫలమయ్యారు. 'ఆదలాల్ కాదల్ సైవీర్', 'పాండీయవునాడు', 'జీవా', 'పాయుమ్ పులి', 'విల్ అంబు' వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన సుసీంద్రన్... 'జీవా' చిత్రంతో నిర్మాతగా కూడా మారారు.