బాహుబలిః ది ఎపిక్‌లో కట్‌ అయిన సీన్లు ఏంటో తెలుసా? ప్రభాస్‌తో సహ ఈ సీన్లన్నీ లేపేసిన రాజమౌళి

Published : Oct 29, 2025, 07:07 PM IST

Bahubali The Epic: బాహుబలి రెండు సినిమాలను కలిపి `బాహుబలిః ది ఎపిక్‌` గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇందులో ఏ ఏ సీన్లు కట్‌ చేశారో రాజమౌళి వెల్లడించారు. 

PREV
15
`బాహుబలిః ది ఎపిక్‌`గా రాబోతున్న బాహుబలి రెండు భాగాలు

`బాహుబలి` సినిమాలు ఇండియన్‌ సినిమాని ఎంతగా ప్రభావితం చేశాయో అందరికి తెలిసిందే. భారతీయ సినిమా లెక్కలను మార్చేశాయి. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ని స్టార్ట్ చేశాయని చెప్పొచ్చు. అంతేకాదు `బాహుబలి 2` మూవీ ఇండియాలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగానూ నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీ రికార్డులు పదిలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే `బాహుబలి 2` విడుదలై ఎనిమిదేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. అయితే రెండు పార్ట్ లు కలిపి ఒకే మూవీగా విడుదల చేస్తుండటం విశేసం. దీని కోసం రెండు సినిమాలను చాలా వరకు ట్రిమ్‌ చేసి ఒక్క పార్ట్ గా చేశారు రాజమౌళి. `బాహుబలిః ది ఎపిక్‌` పేరుతో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

25
ప్రభాస్‌, రానాతో రాజమౌళి చిట్ చాట్‌

రెండు సినిమాలను ఒక్క మూవీగా కలపడం చాలా కష్టం. చాలా సీన్లని లేపేయాల్సి వస్తోంది. అయితే మరి `బాహుబలిః ది ఎపిక్‌`లో ఏ సీన్లు కట్‌ చేశారు, ఏ సీన్లు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. సినిమా నిడివిని, ఏ సీన్లని కట్‌ చేశారో తెలిపారు. సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి చిట్‌ చాట్‌ చేశారు. ఇందులో చాలా విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ఈ మూవీ నిడివి, కట్‌ అయిన సీన్ల గురించి తెలిపారు.

35
మూడు గంటల 43 నిమిషాలతో బాహుబలి ది ఎపిక్‌ విడుదల

ఐదేళ్ల క్రితమే ఈ రెండు సినిమాలను ఒక్కటిగా విడుదల చేయాలని భావించారట. కొంత ప్రయత్నం చేసినా అప్పుడు సాధ్యం కాలేదట. ఆ తర్వాత స్టోరీ పరంగా ప్లాన్‌ చేశారు, అయినా వర్కౌట్‌ కాలేదట. ఆ తర్వాత ఎపిసోడ్ల వైడ్‌గా కట్‌ చేయడం స్టార్ట్ చేశారట. అలా వర్కౌట్‌ అయ్యిందట. కథ ఫ్లోని బట్టి సీన్లని ఉంచి, మిగిలిన సీన్లని లేపేసినట్టు తెలిపారు రాజమౌళి. సినిమా మెయిన్‌ స్టోరీని చెప్పే సీన్లు మాత్రమే ఉంటాయట. డ్రామా ఉంటుందట. మిగిలినవి కట్‌ చేసినట్టు చెప్పారు. అయితే రెండు పార్ట్ లు కలిపితే మొత్తం ఐదు గంటల 22 నిమిషాలు వచ్చిందట. దాన్ని కట్‌ చేయగా, ఫైనల్‌గా మూడు గంటల 43 నిమిషాలు వచ్చిందట. ఈ నిడివితోనే ఈ ఎపిక్‌ మూవీని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోని అన్ని థియేటర్‌ ఫార్మాట్‌లలో ఈ మూవీని ఎడిట్‌ చేశారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో ఇప్పుడు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

45
బాహుబలి ది ఎపిక్‌లో ఈ సీన్లు డిలీట్‌

ఇందులో కట్‌ చేసిన సీన్ల గురించి రాజమౌళి చెబుతూ, ప్రధానంగా మూడు పాటలు ఎగిరిపోయాయట. `పచ్చబొట్టేసినా` పాటని కట్‌ చేశారట. అలాగే `కన్నా నిదురించరా`తోపాటు స్పెషల్‌ సాంగ్‌ `ఇరుక్కో.. `అనే పాటని కూడా లేపేశారట. అంతేకాదు మెయిన్‌గా మొదటి పార్ట్ లో ప్రభాస్‌ శివుడి పాత్ర సీన్లు చాలా కట్‌ చేశారట. మరోవైపు అవంతిక(తమన్నా)తో లవ్‌ ట్రాక్‌ కూడా కట్‌ చేసినట్టు తెలిపారు రాజమౌళి. మెయిన్‌గా వార్‌ సీన్లని కట్‌ చేశారట. వార్‌ ఎపిసోడ్స్ లో చాలా సీన్లు కట్ చేసినట్టు తెలిపారు. అనుష్కతో లవ్‌ ట్రాక్‌ కూడా కొంత కట్‌ చేశారట. అయితే ఇందులో ప్రభాస్‌తోపాటు రానా సీన్లు కూడా కట్‌ అయినట్టు చెప్పారు. మన అనే తేడా లేకుండా అందరివి సమానంగా కట్‌ చేసినట్టు చెప్పారు. ఎడిట్‌ చేయడం పెద్ద టాస్క్ అని తెలిపారు జక్కన్న.

55
ఇండియాలోనే సరికొత్త రికార్డు సృష్టించిన బాహుబలి 2

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌, అడవి శేషు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన `బాహుబలి` చిత్రాలకు రాజమౌళి దర్శకత్వం వహించగా, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. `బాహుబలిః ది బిగినింగ్‌` 2015 జులై 10న విడుదలైంది. ప్రారంభంలో మిశ్రమ స్పందన లభించిన ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. దాదాపు ఆరు వందల కోట్లు వసూలు చేసింది. అనంతరం రెండేళ్లకి `బాహుబలిః ది కన్‌క్లూజన్‌` ని విడుదల చేశారు. ఈ మూవీ ఇండియన్‌ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.1800కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories