Top 5 Most Watched Films on OTT : ప్రతి వారం కొత్త సినిమాల తో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిండిపోతున్నాయి. ఈ వారం కూడా కొత్త సినిమాలు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఈక్రమంలో గత వారం ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల ఏంటో తెలుసా?
ఎప్పటికప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో అందులో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్, ఆహా, సోనీ లివ్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం టాప్ లో నడుస్తున్నాయి. వాటిలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో, అక్టోబర్ 20 నుంచి 26 వరకు ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఆ జాబితాలో తెలుగు సినిమాలెన్ని, తమిళ సినిమాలెన్ని.
24
ఫస్ట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ ఓజీ
ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాల జాబితాలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మొదటి స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 35 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా థియేటర్ లో యావరేజ్ గా నడిచినా.. ఓటీలీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇక ఆ తర్వాత రెండో స్థానంలో 'గ్రేటర్ కలేష్' అనే హిందీ సినిమా ఉంది. ఈ చిత్రానికి ఆదిత్య సంతోఖ్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ జాబితాలో జాన్వీ కపూర్ నటించిన 'పరమ సుందరి' సినిమా మూడో స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమాకు 19 లక్షల వ్యూస్ వచ్చాయి.
34
చివరి స్థానంలో ఎన్టీఆర్ వార్ 2
విజయ్ ఆంటోని నటించిన 'శక్తి తిరుమగన్' సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన 'శక్తి తిరుమగన్' సినిమా జియో హాట్‌స్టార్‌లో 17 లక్షల వ్యూస్ సాధించింది. దీని తర్వాత ఐదో స్థానంలో హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' సినిమా ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 15 లక్షల వ్యూస్ వచ్చాయి.
అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 వెబ్ సిరీస్‌ల జాబితాలో మిర్చి సెంథిల్, షబానా, సుజిత నటించిన 'పోలీస్ పోలీస్' అనే తమిళ వెబ్ సిరీస్ ఐదో స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ 11 లక్షల వ్యూస్ పొందింది. దీని తర్వాత జియో హాట్‌స్టార్‌లోని 'సెర్చ్' వెబ్ సిరీస్ 12 లక్షల వ్యూస్‌తో 4వ స్థానంలో, అమెజాన్ ప్రైమ్‌లోని 'జమునాపార్ సీజన్ 2' 13 లక్షల వ్యూస్‌తో మూడో స్థానంలో, జియో హాట్‌స్టార్‌లోని 'మహాభారత్ ఏక్ ధర్మయుద్ధం' అనే ఏఐ వెబ్ సిరీస్ 14 లక్షల వ్యూస్‌తో 2వ స్థానంలో, నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన 'కురుక్షేత్ర' 20 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉన్నాయి.