అల్లు అర్జున్, మహేష్ కోసం కాదు.. ఆ హీరోయిన్ కోసమే రిపీట్ లో రాజమౌళి చూసే పాటలు ఏవో తెలుసా ?

Published : Oct 11, 2025, 07:10 PM IST

SS Rajamouli: రాజమౌళి ఓ హీరోయిన్ కోసమే పాటలని రిపీట్ గా చూస్తారట. ఆ హీరోయిన్ ఎవరు ? ఆ పాటలు ఏంటి ? అసలు రాజమౌళి ఏమన్నారు ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
రాజమౌళి హీరోయిన్లు

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో హీరోయిన్లు రిపీట్ కావడం కష్టం. రాజమౌళి దర్శకత్వంలో మల్టిపుల్ మూవీస్ లో నటించే అవకాశం కేవలం అనుష్కకి మాత్రమే దక్కింది. విక్రమార్కుడు, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి అభిమానించే హీరోయిన్లలో అలనాటి తార మహానటి సావిత్రి ఒకరు. ఈ తరం హీరోయిన్లలో కాజల్, తమన్నా, ప్రియమణి, జెనీలియా లాంటి వారు రాజమౌళి చిత్రాల్లో నటించారు.

25
శృతి హాసన్ గురించి రాజమౌళి

ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తాను రిపీట్ గా చూసే హీరోయిన్ పాటల గురించి ఓపెన్ అయ్యారు. ఆ హీరోయిన్ తో రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. శృతి హాసన్. గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమె మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది.

35
రిపీట్ మోడ్ లో శృతి హాసన్ పాటలు

శృతి హాసన్ డ్యాన్సింగ్ స్టైల్ అంటే నాకు పిచ్చి. రేసుగుర్రం చిత్రంలో పార్టీ సాంగ్ ని, శ్రీమంతుడు మూవీలో చారుశీల పాటని ఎప్పుడూ రిపీట్ మోడ్ లో చూస్తుంటాను. కేవలం శృతి హాసన్ డ్యాన్స్ కోసమే ఆ సాంగ్స్ ఎప్పుడూ చూస్తుంటాను అని రాజమౌళి అన్నారు.

45
గబ్బర్ సింగ్ తో తొలి విజయం

శృతి హాసన్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ బిగినింగ్ లో ఆమెకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. కానీ గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తనని ట్రోల్ చేసే వారి నోర్లు మూయించింది.

55
శృతి హాసన్ సూపర్ హిట్ చిత్రాలు

శృతి హాసన్ ఖాతాలో గబ్బర్ సింగ్, రేసు గుర్రం, ఎవడు, శ్రీమంతుడు, సలార్, వాల్తేరు వీరయ్య, బలుపు, వీర సింహా రెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. గతంలో శృతి హాసన్ శంతను అనే వ్యక్తితో రిలేషన్ కొనసాగించింది. ఆ మధ్యన వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం శృతి హాసన్ సింగిల్ గా ఉంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories