Rajamouli, Mahesh babu,varanasi
వారణాశి (కాశీ) మన భారతీయులకి పవిత్రమైన ప్రదేశం. అందుకే ఆ ఆధ్యాత్మిక ప్రదేశం పేరు చెప్పగానే కనెక్ట్ అవుతుంటారు. హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకుంటారు. మన సినిమావాళ్లకు ఈ విషయం బాగా తెలుసు.
అందుకే చాలా సినిమాలకు నేపధ్యం కాశీగా తీసుకుంటారు. అక్కడో ఎపిసోడ్ అయినా ప్లాన్ చేస్తారు. చిరంజీవి ఇంద్ర నుంచి నిన్నది ప్రభాస్ కల్కి దాకా ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. తాజాగా మహేష్ బాబు సైతం కాశీలో అడుగు పెట్టనున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mahesh Babu and Rajamouli
మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 జనవరి 2025 లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ రచన, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక మైథలాజికల్ ఎడ్వెంచర్ నేపథ్యంలో రూపొందించబడ్డ స్క్రిప్టు. ఈ చిత్రంలో అంతర్జాతీయంగా పేరున్న నటీనటులు కనిపించనున్నట్లు సమాచారం.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) తో ఆస్కార్‌ను గెలుచుకున్న RRR ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన తరువాత, రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాకు నెక్ట్స్ లెవిల్ లో ఉండబోతోంది. ఈ చిత్రం షూటింగ్ జనవరి 2025లో ప్రారంభం కానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల తన 'మాస్టర్ క్లాస్' సెషన్‌లో వెల్లడించారు. ఈ చిత్రం 2028లో విడుదల కానుంది.
Rajamouli, mahesh babu
ఈ నేపధ్యంలో మహేష్ బాబు – రాజమౌళి. సూపర్ స్టార్‌తో జక్కన్న ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో అని అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తి టైమ్ తీసుకుని ఎప్పటిలాగే చెప్పే పోగ్రాం పెట్టున్నారు.
మహేష్ కూడా ఈ సినిమాతో తన కెరీర్ నెక్ట్స్ లెవిల్ కు ఏ స్దాయికి చేరుకుంటుందో తెలుసు కాబట్టి ఎక్కడా కంగారుపడకుండా ముందుకు వెళ్తున్నారు. వర్క్ షాపులకు అటెండ్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయిటకి వచ్చింది. ఈ కథ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ss rajamouli mahesh babu movie ssmb 29
వారణాశిలో మొదలైన ఈ కథ ఆ తరవాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తం ఓ సెట్ లో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ డిజైన్ చేస్తన్నారు.
మొదట ఇక్కడ షూటింగ్ ప్రారంభించి, ఆ తరవాత సౌత్ ఆఫ్రికా వెళ్తారు. సినిమా ఎక్కువగా అరణ్యాలులో నడుస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలున్న దట్టమైన అడవుల్లో ఇప్పటికే రెక్కీ నిర్వహించారు. జనవరి ఆఖరులో లేదా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
దాదాపు పదేళ్ల క్రితమే మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇన్నేళ్ళు పట్టింది. ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ , శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇది ఊహించని సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్‌గా చెప్పబడుతున్న ఈ చిత్రం ఎక్కువగా అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ నేపథ్యంలో సెట్ చేసారు.
దాదాపు రెండు సంవత్సరాలు స్క్రిప్ట్‌పై పనిచేసిన విజయేంద్ర ప్రసాద్, ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చెప్తున్నారు- ఈ సీన్స్, లొకేషన్స్ ఇంతకు ముందు భారతీయ సినిమాలో చూడనవి ఉండబోతున్నాయట.