ముందు అనుష్క డాక్టర్ కావాలనుకుందట. కానీ అనుకోకుండా జియోగ్రఫీ సబ్జెక్ట్ తీసుకుని జాగ్రఫీ టీచర్‌గా పనిచేసిందట. కొన్నాళ్లు టీచింగ్ కూడా చేసిందట. డిగ్రీ చేస్తూ టీచింగ్ చేసిందట. ఆ సమయంలోనే తన యోగా గురువు భరత్ ఠాకూర్ కలిశారట. ఆయనతో పరిచయం యోగా వైపు తీసుకెళ్లిందని చెప్పింది అనుష్క.
యోగా క్లాసులకు వెళ్తున్నప్పుడు తనకు కావాల్సింది ఇదే అని, యోగా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదని, ఇదే తన లైఫ్ అని ఫిక్స్ అయ్యిందట. అయితే ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు దెబ్బకి పేరెంట్స్ షాక్ అయ్యారట. నాన్న యోగా వైపు వెళ్లడమేంటి అని షాక్ అయ్యాడట.