ఇదిలా ఉంటే హౌజ్‌మేట్స్ కి ఎంటర్‌టైన్ మెంట్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏదైనా చేసి ఆడియెన్స్ ని ఎంటర్టైన్‌చేయాలని చెప్పగా, పెళ్లి చూపులు అనే స్కిట్ ప్రదర్శించారు. ఇందులో అవినాష్, విష్ణు ప్రియా జంటగా నటించగా, వారి అబ్బాయిగా గౌతమ్ నటించాడు. అలాగే తేజ, ప్రేరణ జంటగా నటించగా, కూతురిగా రోహిణి, యష్మి, కొడుకుగా పృథ్వీరాజ్ నటించారు. ఇద్దరు కూతుళ్లలో యష్మి పెద్ద అమ్మాయి అని చెప్పడంతో గౌతమ్.. యష్మినే పెళ్లి కూతురు అని భావించాడు. ముచ్చటపడి పెళ్లికి ఒప్పుకున్నారు. మ్యారేజ్ తంతు కూడా ప్లాన్ చేశారు. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. అయితే హౌజ్‌లో యష్మికి తన ఇంట్రెస్ట్ ని తెలియజేశాడు గౌతమ్. కానీ ఆమె యాక్సెప్ట్ చేయలేదు. దీంతో అప్పట్నుంచి వీరి మధ్య గొడవ నడుస్తూనే ఉంది. అయితే ఆమెపై క్రష్‌ని గౌతమ్ ఈ రూపంలో తీర్చుకోవడం విశేషం.