రాజమౌళి అపజయం లేని దర్శకుడు. ఆయన `స్టూడెంట్ నెం1`తో దర్శకుడిగా పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. `సింహాద్రి`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్` ఇలా ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ, హీరోల స్థాయిని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. ఆయన్ని ఇంటర్నేషనల్ స్టార్‌గా మార్చే పనిలో ఉన్నాడని చెప్పొచ్చు.