నటి అర్చన టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అర్చన ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేసింది. కొన్ని చిత్రాల్లో ఆమె ప్రధాన నటిగా కూడా నటించింది. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా, శ్రీరామదాసు, కమలతో నా ప్రయాణం లాంటి చిత్రాల్లో అర్చన నటించింది.