మహష్-రాజమౌళి సినిమాకి AI టెక్నాలజీ, ఏ సీన్స్ లో వాడబోతున్నారు?

First Published | Oct 19, 2024, 6:26 AM IST

 టెక్నాలిజినీ అందిపుచ్చుకుని సినిమాల్లో ఎడాప్ట్ చేసే దర్శకుడు రాజమౌళి సైతం తన సినిమాకు ఏఐ టెక్నాలిజీని వినియోగించబోతున్నట్లు సమాచారం.

Rajamouli, mahesh babu,AI


ఇప్పుడు ఎక్కడ విన్నా  Artificial Intelligence (AI) (కృత్రిమ మేథస్సు)పై చర్చ జరుగుతోంది. చాట్‌జీపీటీ, బార్డ్, బింగ్ వంటి చాట్‌బాట్స్ పలు రంగాలపై పెను ప్రభావం చూపుతూ ముందుకు వెళ్తున్నాయి. ఎంతటి కష్టమైన పని అయనా ఏఐ టూల్స్ క్షణాల్లో చేసేస్తూ చక్కబెడుతోంది.

ఈ క్రమంలో  మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు ఏఐ టూల్స్‌ను ప్రత్యేకంగా తీసుకొస్తున్నాయి.  ఇప్పుడు అన్ని రంగాలవారు  AI ను ఎడాప్ట్ చేసుకోవటానికి ఆసక్తి చూపెడుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఏఐ ఊహించని మార్పులకు కారణం అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో టెక్నాలిజినీ అందిపుచ్చుకుని సినిమాల్లో ఎడాప్ట్ చేసే దర్శకుడు రాజమౌళి సైతం తన సినిమాకు ఏఐ టెక్నాలిజీని వినియోగించబోతున్నట్లు సమాచారం.


ప్రస్తుతం  మహేష్ బాబుతో రాజమౌళి నెక్ట్స్  సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన కథాంశం ను రెడీ చేసినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

రాజమౌళి ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్‌, మహేష్ బాబు ఎప్పుడూ నటించని కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. ఈ ఏడాదిలో సినిమా ను ప్రారంభించి, వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నాడు.



  మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. VFX వర్క్ కు ఈ సినిమాలో ఎక్కువ అవకాసం ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి పెరిగిన మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తారు.  

ఈ క్రమంలో అక్కడ స్టాండర్డ్స్ ని అందుకునేలా హలీవుడ్ స్దాయిలో లో ఈ సినిమా  తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ను  వాడుకోవాల‌ని దర్శకుడు భావిస్తున్న‌ట్టు  సమాచారం.  ఏఐతో తక్కువ వ్యవధిలో మంచి అవుట్ పుట్ వచ్చే అవకాశాలు ఉండటంతో, వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయ‌డానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని భావించి అందుకు సంభందించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు Artificial Intelligence (AI)లో అగ్ర‌గామిగా ఉన్న ప్రముఖ స్టూడియోల‌తో టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. న్యూజ్ లాండ్ కు చెందిన ఓ AI స్టూడియో వారు తమ వర్క్ లను చూపించి, రాజమౌళి సినిమాకు సంభందించిన శాంపిల్ వర్క్ చేసి ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో AI ఎక్కడెక్కడ వినియోగపడుతుందనే విషయమై రాజమౌళి రీసెర్చ్ తరహా వర్క్ చేస్తున్నారట.

ఓ అద్బుతం చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. ఏఐతో తక్కువ వ్యవధిలో VFX కి అదిరిపోయే అవుట్ పుట్ వచ్చే అవకాశాలు ఉండటంతో, వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయ‌డానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని అనుకుంటున్నారట. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగే ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ గా నిలవనుంది. 
 

Mahesh Babu

AI  సినిమాల్లో వినియోగం విషయానికి వస్తే  ...ఇప్పటికే  హాలీవుడ్ రచయితలు, నటీనటులు ఏఐ టెక్నాలజీ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల తమ ఉపాధికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటు భారతీయ చిత్ర పరిశ్రమ సైతం కృత్రిమ మేథను అందిపుచ్చుకుంటోంది.

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు -2లో ఏఐని వాడారు.అలాగే సత్యరాజ్ నటించిన వెపన్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ సీక్వెన్స్‌కు రూపకల్పన చేశారు. ఇందులో సత్యరాజ్‌ను యంగ్ ఏజ్‌లోకి తీసుకెళ్లే కొన్ని సన్నివేశాలను రూపొందించాల్సి రావడంతో కృత్రిమ మేధ సాయం తీసుకున్నారు. 

Latest Videos

click me!