`రివైండ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 19, 2024, 12:13 AM IST

ఈ శుక్రవారం వచ్చిన చిత్రాల్లో `రివైండ్‌` మూవీ కూడా ప్రత్యేకంగా నిలిచింది. కంటెంట్‌ బేస్డ్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

సాయి రోనక్‌ హీరోగా, అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా `రివైండ్‌`. కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ క్రాస్‌ వైర్‌ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రమిది. టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆకట్టుకునే సినిమాలే తక్కువ. ఈ క్రమంలో తాజాగా మరోసారి టైమ్‌ ట్రావెల్‌ కథతో ఈ `రివైండ్‌` మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కళ్యాణ్‌ చక్రవర్తి. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కథః 
శాంతి(అమృతా చౌదరి) వాళ్ల తాత కృష్ణమూర్తి(సామ్రాట్‌) ఫిజిక్స్ లెక్చరర్‌. ఆయన కష్టపడి టైమ్‌ మిషన్‌ని తయారు చేస్తాడు. దాన్ని ప్రయోగిస్తాడు. దీంతో 1980 నుంచి 2019లోకి ట్రావెల్‌ చేసి వస్తాడు. కట్‌ చేస్తే 2014లో అసలు కథ ప్రారంభమవుతుంది. ఈ టైమ్‌లో శాంతి, కార్తీక్‌(సాయి రోనక్‌) తొలి చూపులోనే ప్రేమలో పడతారు. కొన్ని రోజుల తర్వాత శాంతికి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు కార్తీక్‌.

అయితే ఇంతలోనే ఆయనకు ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెబుతుంది శాంతి. ఓ ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తానని చెబుతుంది. అలా తాను ఐదేళ్లుగా ప్రేమిస్తున్న వ్యక్తిని పరిచయం చేసి షాకిస్తుంది. కార్తీక్‌ సాఫ్ట్ వేర్ డెలవపర్‌. చిన్నప్పుడే అమ్మ, కరోనా సమయంలో నాన్న చనిపోతాడు. ఇప్పుడు లవ్‌ ఫెయిల్యూర్‌. తనకు ఎవరి ప్రేమ దక్కదని విసిగిపోతాడు. ఈ క్రమంలోనే ఆ టైమ్‌ ట్రావెల్‌ మిషన్‌ కార్తీక్‌ కి టైమ్‌ మిషన్‌ దొరుకుతుంది. అక్కడి నుంచి అతను టైమ్‌ ట్రావెల్‌ చేస్తాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్లాడు?శాంతి లవ్‌ చేసింది ఎవరిని? కార్తీక్‌, శాంతిల లవ్‌ ట్రాక్‌ ఎలాంటి మలుపులు తిరిగింది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ. 
 

Latest Videos


విశ్లేషణః 

టైమ్‌ ట్రావెల్‌ కథతో చాలా కథలే వచ్చాయి. `ఆదిత్య 269` నుంచి సూర్య `24`, ఇటీవల శర్వానంద్‌ `మనమే` వంటి సినిమాలు వచ్చాయి. వీటితోపాటు చిన్నా చితకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ ఈ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ `ఆదిత్య 269` రేంజ్‌లో ఏ మూవీ విజయం సాధించలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆడియెన్స్ కి రీచ్‌ కాలేదు. కన్విన్స్ కాలేదు.

ఈ క్రమంలో ఇప్పుడు `రివైండ్‌` పేరుతో మరో ప్రయోగం చేశారు దర్శకుడు కళ్యాణ్‌ చక్రవర్తి. ప్రేమ కథకి, టైమ్‌ ట్రావెల్‌కి ముడిపెట్టి, అలాగే తండ్రి కొడుకుల ఎమోషన్స్ కి ముడిపెడుతూ ఈ కథని నడిపించిన తీరు బాగుంది. ఈ విషయంలో దర్శకుడు సాహసం అభినందనీయమనే చెప్పాలి. ఈ మూవీలో చాలా రకాలుగా ప్రయోగాలు చేశారు దర్శకుడు.

ఈ కాన్సెప్ట్ సినిమాల్లో చాలా లాజిక్స్ ఉంటాయి? వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు ఆడియెన్స్ ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ సాహసం పెద్ద కత్తిమీద సాములాంటిదే. ప్రేమ కథని టైమ్‌ ట్రావెల్‌కి లింక్‌ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించిన తీరు బాగుంది. మెయిన్‌గా హీరోహీరోయిన్ల ప్రేమ కథగా సినిమా సాగుతుంది.

దానికి ఈ టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ ని యాడ్‌ చేసి కొత్త లవ్‌ స్టోరీగా మార్చేశారు. ఇది ఒక ఎగ్జైటింగ్‌ పాయింగ్‌గా చెప్పొచ్చు. టైమ్‌ మిషన్‌ని కనిపెట్టిన కృష్ణమూర్తి దాన్ని ఉపయోగించి 2019కి వస్తాడు. అక్కడి నుంచి ఆయన మాయమై పోతాడు. మధ్య మధ్యలో చాలా ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. సస్పెన్స్ అంశాలుంటాయి. 
 

మొదటి భాగంలో ఎక్కువగా హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. అదే సమయంలో కథని, పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు ఎక్కువ టైమ్‌ తీసుకున్నట్టుగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో హీరో టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం డీసెంట్ గానే అనిపిస్తుంది. కాకపోతే టైమ్ మెషిన్ వాడిన కృష్ణమూర్తి ఏమయ్యాడు? ఆ మిషన్‌ ఏమైందనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి.

ఫస్టాఫ్‌లో వదిలేసిన సస్పెన్స్ అంశాలకు రెండో భాగంలో సమాధానం చెప్పాడు దర్శకుడు. ఒక్కోట్విస్ట్ ని రివీల్‌ చేస్తుంటే ఆడియెన్స్ కి క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ జరిగిన కథను రివైండ్ చేసి మళ్లీ ప్లే చేస్తారు. అక్కడ ఏదైతే ప్రశ్నలు వదిలేశారో.. ఆ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు ఇస్తూ వెళ్లారు. అలాగే సినిమాలో తండ్రీకొడుకు ఎమోషన్ ని కూడా బాగా ఎస్టాబ్లిష్‌ చేశాడు. కార్తిక్ కి తన తండ్రి(సీనియర్ నటుడు సురేశ్) మీద ఉన్న ప్రేమను, ఆయనతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అలరించేలా ఉంటాయి,

అదే సమయంలో ఎమోషనల్‌గానూ అనిపిస్తాయి. సెకండాఫ్ లో ఆడియన్ ప్రశ్నలకు సమాధానాలను  ఒక్కో ట్విస్టు రివీల్ అవుతూ ఉంటే ఆడియన్ ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వస్తుంది. అయితే ఇందులో చాలానే నెగటివ్‌ అంశాలున్నాయి. చాలా లాజిక్కులు మిస్‌ అయ్యాయి. స్లో నెరేషన్‌ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అంశం. స్క్రీన్‌ ప్లే మరింత గ్రిప్పింగ్‌గా చేయాల్సింది. ఓవరాల్‌గా ఈ మూవీ ట్విస్టులు, టర్నులతో సాగే మంచి లవ్ ఎంటర్ టైనర్ చూపించారు.
 

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరుః  

సాయి రోనక్‌ మంచి నటుడు. కానీ ఆయన రేంజ్‌ సినిమాలు పడటం లేదు. అయినా తన బెస్ట్ ఇస్తూ మెప్పిస్తున్నాడు. ఇందులో సాఫ్ట్ వేర్‌గా, ప్రేమికుడిగా, తండ్రి కోసం తాపత్రయపడే కొడుకుగా విభిన్నమైన ఎమోషన్స్ ని పలికించి మెప్పించాడు. తెలుగమ్మాయి అమృత చౌదరి తన అందంతో అలరిస్తూ, నటనతో కూడా మెప్పించింది. సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము..

మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో మెప్పించారు. టెక్నీకల్‌గా భారత  సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కథకు తగ్గట్టు ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ లో ప్రేమ కథ జోడించి ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. ఇక చిన్న సినిమా అయినా నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.

దర్శకుడు ఒక రిస్కీ సబ్జెక్ట్ ని అంతే బాగా డీల్‌ చేసి మెప్పించాడు. విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని రక్తికట్టించి మెప్పించాడు. గుండె బరువెక్కించాడు.  ఓవరాల్ గా సినిమాలో ఆడియన్ ని ఒక మంచి ఎగ్జైట్మెంట్ తో  బయటకు వస్తారు. ట్విస్టులు, టర్నులు మరింత సర్ ప్రైజ్‌ చేసే అంశాలు. 

ఫైనల్‌గాః అభినందనీయ ప్రయత్నం `రివైండ్‌`. 

రేటింగ్‌ః 2.75
 

Read more: ప్రేమ విషయం చెప్పనందుకు మంచు విష్ణుపైకి వెళ్లిన మోహన్‌బాబు.. సీన్‌లోకి స్టార్‌ డైరెక్టర్‌ భార్య, ఏంటి కథ?

click me!