మెగా చీఫ్ గా గౌతమ్, బిగ్ బాస్ హౌస్ లో వెన్నుపోటు ఆటలు.. అవినాశ్ త్యాగం

First Published | Oct 19, 2024, 12:18 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజుకో సినిమా చూపిస్తున్నారు. రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ పోటా పోటీగా టాస్క్ లు ఆడటంతో పాటు.. ఎంటర్టైన్మెంట్ కూడా అదే రేంజ్ లో చూపిస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఉం జరిగిదంటే..? 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 7 వారం ముగిసింది. వీకెండ్ వచ్చేసింది. నాగార్జున నెక్ట్స్ ఎపిసోడ్ లో ఎంట్ర ఇవ్వబోతున్నాడు. ఈసారి దాదాపు అందరికి గట్టిగానే క్లాస్ పీకే అవకాశం కనిపిస్తోంది. ఎందుకుంటే వారు చేసిన తప్పులు అన్ని ఉన్నాయి మరి. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ కు మెగా చీఫ్ గా గౌతమ్ విజయం సాధించాడు. ఈక్రమంలో అతను తన క్లాన్ సభ్యులు.. తన క్లోజ్ ప్రెండ్స్అయినా..మెహబూబ్ తో పాటు అవినాశ్ కు కూడా వెన్నుపోటుపొడిచాడు. 

ఇక అంతకు ముందు జరిగిన ఓవర్ స్మార్ట్ టాస్క్ లో రాయల్ క్లాన్ విజయం సాధించారు. దాంతో గేమ్ నుంచి నబిల్, నిఖిల్ రేస్ నుంచి తప్పుకోక తప్పలేదు. ఇక ఫైనల్ గా మిగిలిన వారితో మరో ఫైనల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో కూడా వాదోపవాదముల తరువాత గౌతమ్ బిగ్ బాస్ హౌస్ కు కొత్త చీఫ్ గా గెలిచాడు. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

మెగా చీఫ్‌ను ఎన్నుకోవడం కోసం పట్టుకో లేదంటే వదులుకో" అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా సర్కిల్‌లో ఓ బోన్  ఉంటుంది. దాని చుట్టూ కంటెండర్లు అందరూ తిరగాలి.. ఎవరైతే బజర్ వచ్చినప్పుడు ముందుగా ఆ బోన్‌ను పట్టుకుంటారో వాళ్లు కంటెండర్స్ నుంచి ఇద్దరినీ ఈ పోటీ నుంచి ఎలిమినేట్ చేయవచ్చు. ఇక  ఈ టాస్కులో ఎక్కువసార్లు గౌతమ్‌ బోన్ పట్టుకున్నాడు.. దీంతో చాలా మందిని ఔట్ చేశాడు. ఇక చివరిగా గౌతమ్-గంగవ్వ మిగిలారు. ఇందులో గౌతమ్ గెలిచి మెగా చీఫ్ అయ్యాడు.

ఇక అంతకు ముందు  విన్నర్ ప్రైజ్ మనీ పెంచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగా  అవినాశ్ తో పాటు పృధ్వీ త్యాగం చేయాలన్నారు. పృధ్వీకి గెడ్డం తో పాటు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. అది తియ్యనే తియ్యడు.అటువంటిది. పృధ్వీ గెడ్డం తీస్తే 25 వేలు.. గెడ్డంతో పాటు జుట్టు కాస్త కత్తిరించుకుంటే 50 వేలు.. క్లీన్ షేవ్ తో పాటు హెయిర్ స్టైల్ మార్చుకుంటే లక్ష రూపాయలు ప్రైజ్ మని ఇస్తామన్నారు బిగ్ బాస్. 


ఇక అవినాష్ కు కూడా ఇంచుమించు ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్ కాకపోతే కాస్త డిఫరెంట్ గా . అయితే ఇద్దరిలో అవినాష్ మాత్రమే ఈ డీల్ కు ఉఒకే చెప్పాడు. పృధ్వీ ససేమిరా అనేశాడు. దాంతో అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో హీరో అయ్యాడు. అంతే కాదు అతని త్యాగం వల్ల 50 వేల ప్రైజ్ మనీ పెరగడంతో పాటు... కుక్కింగ్ కోసం రెండు గంటలు యాడ్ అయ్యాయి. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం వీకెండె వచ్చేసింది. ఈసారిఎలిమినేషన్ ఎవరు..? నాగార్జున క్లాస్ పీకేది ఎవరికి. ఆటలో ఎవరు ఫస్ట్.. ఎవరు లాస్ట్. ఓవర్ యాక్టింగ్ స్టార్ ఎవరు అనేది శనివారం తేల్చబోతున్నాడు నాగ్. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Latest Videos

click me!