'బాహుబలి 3' ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్

Published : Oct 30, 2025, 05:15 PM IST

బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతున్న సందర్భంగా బాహుబలి 3 ప్రకటన కూడా ఉండొచ్చు అనే అంచనాలు మొదలయ్యాయి. దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ బడ్జెట్ వివరాలు బయటపెట్టారు. 

PREV
15
బాహుబలి 3 ఎపిక్ 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రం అక్టోబర్ 31న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు భాగాలని కలిపి ఒకే చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీనితో రాజమౌళి, ప్రభాస్, రానా ముగ్గురూ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. వీరు ముగ్గురూ మాట్లాడుతున్న ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. 

25
బాహుబలి 3 ఉంటుందా ?

బాహుబలి 3 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని గతంలోనే రాజమౌళి ప్రకటించారు. ఈ ఇంటర్వ్యూలో బాహుబలి 3కి సంబంధించిన చర్చ జరిగింది. బాహుబలి రెండు భాగాలు చితీకరిస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బందులు, బడ్జెట్ సమస్యలు, వాటిని అధికమించి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన విధానం వీటన్నింటి గురించి ప్రభాస్, రాజమౌళి, రానా మధ్య చర్చ జరిగింది. 

35
కొత్త సన్నివేశాలు ఉండవు 

రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలిలో తొలగించిన, ఎడిట్ చేసిన కొన్ని సీన్లు కూడా బాహుబలి ది ఎపిక్ లో యాడ్ చేస్తున్నాం అని జనాలు మాట్లాడుకుంటున్నారు. అది జస్ట్ రూమర్ మాత్రమే. యాడ్ చేసిన సీన్లు ఏమీ లేవు. మొత్తం ఆల్రెడీ సినిమాలో ఉన్న సీన్లే అని రాజమౌళి అన్నారు. మరి నాజర్ గారు ఎందుకు మళ్ళీ బాహుబలి ది ఎపిక్ కోసం డబ్బింగ్ చెప్పారు ? అని పక్కనే ఉన్న రానా ప్రశ్నించారు. దానిగురించే చెబుతున్నా అని జక్కన్న సమాధానం ఇచ్చారు. 

45
బాహుబలి ది ఎటర్నల్ వార్

ప్రకటించిన రాజమౌళి  బాహుబలిలో శివుడు తిరిగి మాహిష్మతికి వచ్చినప్పుడు నాజర్ డైలాగులు ఉంటాయి. బాహుబలిని చంపేశాం కదా, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే డైలాగులు ఉంటాయి. దానిని కనెక్ట్ చేస్తూ బాహుబలి ది ఎపిక్ ఇంటర్వెల్ లో ఒక టీజర్ ఉంటుంది. బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో ఈ టీజర్ రిలీజ్ చేస్తాం. అది బాహుబలి 3 గురించే ప్రకటన అనే రూమర్ కూడా జనాల్లో ఉంది. కానీ అది బాహుబలి 3 కాదు. 

55
బడ్జెట్ 120 కోట్లు 

 అది ఒక యానిమేషన్ మూవీ. యానిమేషన్ అంటే జనాల్లో చాలా సందేహాలు ఉంటాయి. కానీ ఇది 3డి యానిమేషన్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బాహుబలి 3 కాదు కానీ .. బాహుబలి 2కి కొనసాగింపుగానే ఉంటుంది అని రాజమౌళి తెలిపారు. దీనిపై ప్రస్తుతం శోభు యానిమేషన్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారట. దీని బడ్జెట్ ఏకంగా 120 కోట్లు అని రాజమౌళి ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా ప్రభాస్ కి మైండ్ బ్లాక్ అయింది. ఒక యానిమేషన్ చిత్రానికి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నారా అని ప్రభాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది బాహుబలి 1 బడ్జెట్ తో దాదాపుగా సమానం అని ప్రభాస్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories