కనీసం అవగాహన లేకుండా చిత్రీకరించి బ్లాక్ బస్టర్ కొట్టిన రాజమౌళి..చిత్రహింసలు పెట్టడం అంటే ఇదే, ఆ మూవీ ఏంటంటే

Published : Oct 26, 2025, 10:39 AM IST

రాజమౌళి ఓ చిత్రాన్ని జీరో నాలెడ్జ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ మూవీ వెనుక పడ్డ టెన్షన్, కష్టాన్ని వివరించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.  

PREV
15
రాజమౌళి రిస్క్ చేసిన చిత్రాలు

దర్శకధీరుడు రాజమౌళి పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి ఖ్యాతి దాక్కుతోంది. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఇంతవరకు రాజమౌళికి ఫ్లాప్ లేనప్పటికీ ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో రిస్క్ తో కూడుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. మగధీర, ఈగ, బాహుబలి 1 లాంటి చిత్రాలని రాజమౌళి ఎంతో రిస్క్ చేసి తెరకెక్కించారు. 

25
వాటి గురించి రాజమౌళికి జీరో నాలెడ్జ్ 

మగధీర అయితే అప్పటికి టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని బడ్జెట్ తో రూపొందింది. బాహుబలి 1 మూవీ అయితే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయితే తప్ప బడ్జెట్ వెనక్కి రాని పరిస్థితి. ఇక ఈగ సినిమా పరిస్థితి పూర్తిగా వేరు. ఈగ మూవీ తెరకెక్కించే సమయానికి రాజమౌళికి యానిమేషన్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఆవగింజ అంత అవగాహన కూడా లేదట. ఈ విషయాన్ని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఈగ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతని మకుట అనే సంస్థకి అప్పగించాం. 

35
పరమ అసహ్యంగా ఉంది

ఈగని డిజైన్ చేసి సినిమా చిత్రీకరిస్తే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ పెడతారనే అవగాహన కూడా నాకు లేదు. దీనితో ప్రీ ప్రొడక్షన్ లోనే ఈగ ఎలా ఉంటుంది, దాని మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది డిజైన్ చేసి చూపించమని వాళ్ళని అడిగాం. దీనితో వాళ్ళు 6 నెలలు కష్టపడి ఒక ఫుటేజ్ తయారు చేసి చూపించారు. ఆ ఫుటేజ్ చూసిన వెంటనే నా గుండె జారిపోయింది. ఫుటేజ్ ఏమాత్రం బాగాలేదు. ఈగ పరమ అసహ్యంగా ఉంది. అసలు అది ఈగలా లేదు. ఏదో రోబోట్ నడిచినట్లు ఉంది. ఏదైనా చిన్న అంశం బావున్నా దాని నుంచి డెవలప్ చేయవచ్చు అనుకుంటే ఏదీ బాగాలేదు. అప్పటికే షూటింగ్ లో 10 కోట్లు ఖర్చైపోయింది. 

45
సినిమా ఆపేద్దాం అనుకున్నా 

కోటి రూపాయల లోపు ఖర్చు అయి ఉంటే సినిమా ఆపేసేవాడిని. వేరే ఏదైనా సినిమా చేసుకునేవాడిని. ఇప్పుడు వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మకుట వాళ్ళని అడిగితే.. అసలు ప్రీ ప్రొడక్షన్ అనేది మా పని కాదు.. మీరు డిజైన్ చేసి ఇస్తే దానిపై మేము వర్క్ చేస్తాం అని చెప్పారు. నా మైండ్ బ్లాక్ అయింది. 2 రోజులు బాధపడ్డాక ఏదైతే అది అయింది అని రీ వర్క్ చేశాం. ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్ కాదు ని భావించి నిజమైన ఈగ ఎలా ఉంటుందో పరిశీలించాలని అనుకున్నాం.  కొందరు కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లని మీట్ అయి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు నిజమైన ఈగలని ఫోటో షూట్ చేయాలని అనుకున్నాం. నిజమైన ఈగ ఎక్కువ సేపు ఉండదు. ఎగిరి వెళ్ళిపోతుంది. దానిని బాగా క్లోజప్ గా ఫోటో తీయాలి అంటే పవర్ ఫుల్ లెన్స్ కావాలి. అప్పుడు కూడా అది ఎక్కువ సేపు ఉండదు. దీనితో నెట్ లో సెర్చ్ చేస్తే.. ఈగలని పట్టుకుని వాటిని ఫ్రిజ్ లో కొంత సమయం పెడితే అవి స్పృహ కోల్పోతాయి లేదా వేగంగా కదలలేవు అని తెలిసింది. 

55
ఈగలని చిత్రహింసలు పెట్టిన రాజమౌళి 

దీనితో కొన్ని ఈగలని పట్టుకుని ఫ్రిజ్ లో పెట్టాం. అవి కదలలేని స్థితిలోకి వెళ్ళాక బయటకి తీసి ఫోటో షూట్ చేశాం. అప్పుడు కూడా కెమెరా ఆన్ చేయగానే ఆ వేడికి కొన్ని ఈగలు యాక్టివ్ అయి వెళ్లిపోయేవి. అలా ఈగలని చిత్ర హింసలు పెట్టి మొత్తానికి ఫోటో షూట్ పూర్తి చేశాం. అప్పుడు ఈగ ఒరిజినల్ గా కలర్ ఎలా ఉంటుంది. అది స్లోగా కదిలినప్పుడు మూమెంట్స్ ఎలా ఉంటాయి ఇలా అన్ని డీటెయిల్స్ తెలిశాయి. ఆ విధంగా ఇప్పుడు సినిమాలో ఉన్న ఈగని డిజైన్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఇంత టెన్షన్, కష్టం తర్వాత అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

Read more Photos on
click me!

Recommended Stories