ప్రేమనగర్ రివ్యూ, వాణిశ్రీ హెయిర్ స్టైల్, ఏఎన్నార్ వెస్ట్రన్ స్టెప్స్ .. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా

Published : Oct 26, 2025, 08:52 AM IST

Prema Nagar Review : అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన చాలా సినిమాలు ట్రెడ్ సెట్టర్ గా నిలిచాయి. ఏదో ఒక కొత్త ట్రెండ్ ను తెలుు పరిశ్రమకు పరిచయం చేశాయి. అటువంటి సినిమాల్లో ప్రేమనగర్ ఒకటి.

PREV
18
ప్రేమనగర్ తెర వెనుక కథ

అక్కినేని నాగేశ్వరావు , వాణిశ్రీ జంటగా.. కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేమనగర్. ప్రతీ సినిమాతో ఏదో ఒక ట్రెండ్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ వచ్చారు ఏఎన్నార్. ఈ సినిమాతో కూడా సరికొత్త చరిత్ర సృస్టించారు అక్కినేని. కోడూరి కౌసల్యా దేవి రాసిన “ప్రేమ్ నగర్” నవల ఆధారంగా సినిమా తెరకెక్కించారు. ఈ నవలను ఓ డిస్టిబ్యూటర్ తీసుకుని, దాన్నిస్క్రిప్ట్ గా డెవలప్ చేయంచి.. అక్కినేనికి ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరావుకి ఇలా స్క్రిప్ట్ లు చదివే అలవాటు మొదటి నుంచీ లేదు. దాంతో తన భార్య అన్నపూర్ణకు అది ఇచ్చి చదవమన్నారట. ఆ స్క్రిప్ట్ చదివి వినిపించిన అన్నపూర్ణమ్మ.. ఈసినిమా సూపర్ హిట్ అవుతుంది, దేవదాసు తరువాత ఆస్థాయిలో ప్రేమనగర్ ఆడుతుంది అని చెప్పారట. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడంతో ఈసినిమాకు అక్కినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆరునెలలకు పైగా షూటింగ్ జరుపుకున్న ప్రేమనగర్ సినిమా 1971 సెప్టెంబర్ 21న రిలీజ్ అయ్యింది.

28
ప్రేమనగర్ కథ విషయానికి వస్తే..

భారీగా ఆస్తలు కలిగి, జమీందారు కుటుంబానికి చెందిన రెండవ కుమారుడు “కళ్యాణ్”( అక్కినేని నాగేశ్వరావు). ఎప్పుడూ.. మందు తాగుతూ.. అమ్మాయిలతో జల్సా చేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న మిడిల్ క్లాస్ అమ్మాయి లత( వాణిశ్రీ) తల్లి లేదు, తండ్రి, అన్నదమ్ములు ఇద్దరు, తోడబుట్టిన అక్కతో కలిసి ఉంటుంది. లత తన ప్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల .. ఎయిర్ హోస్టెస్ జాబ్ నుంచి బయటకువచ్చి.. వేరే జాబ్ చూసుకోవలి అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఆమె కళ్యాణ్‌కి సెక్రటరీగా చేరుతుంది. ఇక ఆమెను కూడా అందరు ఆడవారిలా భావించిన కళ్యాణ్.. ఆమెను తన గెస్ట్ హౌస్ కు రమ్మంటాడు. కళ్యాణ్ తాగుడు వల్లే ఇలా అయ్యాడు కాబట్టి.. ఆ అలవాటు మాన్పిస్తానని హీరో తల్లికి మాటిస్తుంది లత. ఈక్రంలో కళ్యాణ్ తో తాగుడు మార్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేమి ఫలించవు, ఓ రోజు అతని నుంచి గ్లాస్ లాగేసుకుంటుంది. బాటిల్ పగలగొడుతుంది. దాంతో కోపం తట్టుకోలేక లతను గాయపరుస్తాడు కళ్యాణ్. అప్పటి నుంచి తాగుదామని ప్రయత్నం చేసిన ప్రతీసారి.. లత గాయం గుర్తుకువస్తుంది. ఇక తన మందు సీసాలన్నీ పగలగొట్టి.. లతకి ఇక తాగనని మాట ఇస్తాడు హీరో. ఆ తర్వాత కళ్యాణ్ లతను గాఢంగా ప్రేమించడం మొదలుపెడగాడు. . 

38
ప్రేమనగర్ కథలో ట్విస్ట్ లు

కళ్యాణ్ ,లత ప్రేమించుకోవడం గమనించిన  కళ్యాణ్ అన్న కేశవవర్మ( కైకాల సత్యనారాయణ) తన తల్లితో కలిసి వీరిద్దరిని విడదీయ్యడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వీరి మధ్యలో విభేదాలు సృష్టిస్తారు. లతపై దొంగతనం నింద వేసి బటకు పంపిస్తారు. కళ్యాణ్ కూడా ముందు ఈ విషయం నమ్ముతాడు.. ఆతరువాత అసలు విషయం తెలిసి లతకు క్షమాపణలు చెబుతాడు.. కానీ ఆమె క్షమించదు. ఆ బాధతో మళ్లీ తాగడ మొదలు పెట్టి.. అనారోగ్యం పాలు అవుతాడు కళ్యాణ్.. అటు లతకు పెళ్ళి కుదరుతుంది.. ఇటు కళ్యాణ్ పరిస్థితి దారుణంగామారుతుంది. ఈ పరిణామాల మధ్య..వీరు కలుసుకుంటారా..? కథ క్లైమాక్స్ ఏంటి?

48
ప్రేమనగర్ మూవీ రివ్యూ..

ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. కానీ.. ప్రతీ సినిమా ఏదో ఒకప్రత్యేకతను చాటుకుంటూ వచ్చింది. ప్రేమ కథలు, విరహ కథలతో ఎక్కువగా సినిమాలు చేసిన అక్కినేని..ప్రతీ సినిమాకు కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నంచేసేవారు. ఈసినిమాలో కూడా అంతే.. జమిందారు ,మధ్యతరగతి అమ్మాయితో ప్రేమలో పడటం, కుటుంబంలో ఉన్నవ్యక్తుల వల్ల అపార్ధం చేసుకోవడం, ఆతరువాత ఆమె కోసం ఆరాటపడటం..ఈ కథలో ఎన్నో ట్విస్ట్ లు దాగా ఉన్నాయి. ప్రతీ సీన్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఏఎన్నార్ ప్రేమ సన్నివేశాలకైతే.. ఆయన ఫ్యాన్స్ ఫిదా అవ్వకుండా ఉండలేరు.. చదువుకుని, ఉద్యోగం చేసే అమ్మాయి ఆత్మాభిమానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమాజంలో నెట్టుకురాగలం అనే విషయాన్ని వాణిశ్రీ చేసిన లత పాత్రలో అద్భుతంగా చూపించారు. కుటుంబంలో ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి అనే విషయం చెపుతూనే.. ఒకరు స్వార్ధంగా ఆలోచించినా చాలు .. ఆ ఫ్యామిలీ విడిపోయి, ముక్కలు అవ్వడానికి అనే నిజాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమనగర్ సినిమాలో ప్రతీ సిన్నివేశం ఒక ఆణిముత్యమని చెప్పాలి. ఎక్కడ బోర్ కొట్టించకుండా.. ప్రతీ సీన్ ను అప్పటి జనరేషన్ కు లింక్ పెడుతూ.. ఆ వెయిట్ తెలిసేలా రాశారు ఆత్రేయ. అందుకే ప్రేమనగర్ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

58
నటీనుల విషయానికి వస్తే..

ప్రేమ కథలకు జీవం పోయాలంటే అది అక్కినేని నాగేశ్వరావు కి మాత్రమే సాధ్యం. ఆయన చేసిన పాత్రల్లో మరెవరిని ఊహించుకోలేము. ఆయన ఒకే విధమైన పాత్రల్లో ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఆ సినమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం ఇలాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు.. ఒకదానికి మరొకటి పోలిక లేకుండా వేరియేషన్ చూపించడంలో అక్కినేని సక్సెస్ అయ్యారు. అందుకే ఆ సినిమాలు, అక్కినేని పాత్రలు చిరస్మరణీయం అయ్యాయి. ఇక ప్రేమ్ నగర్ విషయానికి వస్తే.. ఈసినిమా అంతా హీరో హీరోయిన్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దాంతో ఆ వెయిట్ ను అక్కినేని, వాణిశ్రీ మాత్రమే ఎక్కువగా మోశారు. ఈ సినిమాలో పిల్ల జమిందారు కళ్యాణవర్మగా అక్కినేని పలికించిన హావాభావాలు, లత పాత్రలో వాణిశ్రీ నటన, ఆమె ఆహార్యం అద్భుతం. ఇక ఇతర పాతరల్లోనటి ఎస్వీ రంగారావు, గుమ్మడి, వరలక్ష్మీ , రాజబాబు, కైకాల సత్యనారాయణ, రమప్రభ.. ఇలా సీనియర్ నటీనటులు ఎంతో మదంది ఉన్నారు. కానీ సినిమా అయిపోయే వారకూ.. అందరి కళ్ళు.. అక్కినేని వాణిశ్రీ చుట్టే తిరుగుతుంటాయి.

68
ట్రెండ్ సెట్ చేసిన ప్రేమనగర్

అక్కినేని టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమకు వెస్ట్రన్ స్టెప్పులు నేర్పిన హీరోగా అక్కినేని రికార్డు క్రియేట్ చేశారు. ప్రేమనగర్ లో పాటలకు ఏఎన్నార్ స్టెప్పులు తోడై.. అక్కినేని అభిమానులకు ఉర్రూతలూగించాయి. ఇక ఈసినిమాలో ఏయిర్ హోస్టెస్ పాత్ర కొత్త ప్రయోగం. అప్పటి వరకూ అలాంటి పాత్రను ఏ సినిమాలో చూపించలేదు. అంతే కాదు ఈ పాత్రలో వాణిశ్రీ.హెయిర్ స్టైల్ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. మోచేతులు దాటేవారకూ జాకెట్టు, డిఫరెంట్ గా చీరకట్టు.. ప్రేమ్ నగర్ సినిమా తో ఆ రోజుల్లో తెలుగువారికి కొత్త ఫ్యాషన్ పరిచయం అయ్యింది. ఈ హెయిర్ స్టైల్ ఇక్కడిది కాదు.. ఆస్పీ అనే హెయిర్ డ్రెస్సెర్ ను ఇంగ్లండ్ నుంచి రప్పించి ఈ విధంగా కొత్త ఫ్యాషన్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ రోజుల్లో ఎయిర్ హోస్టస్ తల గోపురంలా ముడి వేసిన జుట్టుతో డిఫరెంట్ గా ఉండేది. ఆ జుట్టుముడి వేసుకోవడం వాణిశ్రీకి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అంత ఇబ్బందిపడ్డందుకు.. ఆ తరువాత అది ఫ్యాషన్ గా మారి.. వాణిశ్రీ హెయిర్ స్టైల్ గా ప్రచారం జరిగింది.

78
మారుమోగిన ప్రేమనగర్ పాటలు

ప్రేమనగర్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. ఈసినిమా పాటలు మరో ఎత్తు.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా నిలిచిన పాటలలిస్ట్ లో ప్రేమనగర పాటలు కూడా పక్కాగాఉంటాయి. ఆత్రేయ సాహిత్యానికి .. మహదేవన్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా పనిచేసింది. మరీముఖ్యంగా మనసు గతి ఇంతే , లే.. లే.. లే.. లేలేలే నా రాజా.. లేలే.. నా రాజా , తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా “, ఎవరికోసం.. ఎవరికోసం.., నేను పుట్టాను ఈ లోక నవ్వింది, ఎవరో రావాలి.. ఇలా ప్రేమ్ నగర్ పాటలన్నీ అప్పటి యువతను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఎన్నో సినిమాల్లో ప్రేమ్ నగర్ పాటలను రీమేక్ చేసి కూడా వాడుకున్నారు.

88
మూడు భాషల్లో ప్రేమనగర్ రికార్డులు

ప్రతీ సినిమాను మార్నింగ్ షో చూసే రామానాయుడు.. ఈసినిమా విషయంలో భయంతో హోటల్ గదిలో తలపులు వేసుకుని ఉండిపోయారట. సినిమా హిట్ అయిన తరువాత ఆయన స్టాఫ్ వెళ్లి తలుపుతట్టి విషయం చెప్పాక బయటకు వచ్చారట. అంత ఉత్కంఠరేపిన ప్రేమనగర్ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. 34 ప్రింట్లతో రిలీజ్అయిన ఈ సినిమా 15 లక్షల బడ్జెట్ నిర్మిస్తే.. ఒక్క తెలుగులోనే దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈసినిమాను వెంటనే తమిళంలో కూడా నిర్మించారు రామానాయుడు. తమిళంలో వసంత మాళిగై టైటిల్ తో 1972 నిర్మించగా.. అందులో వాణిశ్రీ, శివాజీ గణేషన్ జంటగా నటించారు. ఈసినిమాలో హీరో వెంకటేష్ బాలనటుడిగా కనిపించారు. అయితే తమిళంలో రెండు క్లైమాక్స్ లతో ఈసినిమా రిలీజ్ అయ్యింది. ఒక క్లైమాక్స్ లో హీరో మరణిస్తాడు.. ఈ సినిమా బీసీ సెంటర్స్ లో అద్భుతంగా ఆడింది. ఇక ఇదే సినిమాను హిందీలో రాజేష్ ఖన్నా, హేమమాలిని జంటగా రామానయుడు నిర్మించారు. . అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. మూడు భాషలలో, ముగ్గురు వేర్వేరు సాంకేతిక నిపుణులతో తీసిన ఈ సినిమా.. బాక్సా ఫీస్ దగ్గర ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద 1.45 కోట్లు వసూలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన డి.రామానాయుడుని ప్రేమనగర్ రక్షించింది. ఒక థియేటర్ లో 750 రోజులకు నడిచి రికార్డు క్రియేట్ చేసింది ప్రేమ్ నగర్. ప్రేమ కథలు ఇష్టపడే ఇప్పటి యువతకు కూడా ప్రేమ్ నగర్ మంచి ట్రీట్ అవుతుంది. ఈసినిమాను చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories