పులి కసిగా పరిగెడితే ఎలా ఉంటుందో తెలుసా.. చరణ్, ఎన్టీఆర్ మధ్య తేడా అదే, అంచనాలు పెంచేసిన జక్కన్న

First Published Dec 20, 2021, 11:42 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ దీనితో సహజంగానే దేశవ్యాప్తంగా అంచనాలు ఉంటాయి. కానీ ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ దీనితో సహజంగానే దేశవ్యాప్తంగా అంచనాలు ఉంటాయి. కానీ ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. తెలుగు ఆడియన్స్ తో పాటు నార్త్ వాళ్ళు కూడా ఈ చిత్రం కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఆదివారం రోజు ముంబై వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్ర భారీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ ని బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. 'Roar Of RRR In Mumbai' పేరుతో ముంబైలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ రాజమౌళి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. సినిమా గురించి, Ram Charan, Jr NTR గురించి రాజమౌళి వేదికపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

నా రామ్ , నా భీం అంటూ రాజమౌళి ప్రసంగం ప్రారంభించారు. ' రాంచరణ్, తారక్ ఇద్దరూ నా ఫ్యామిలిలో, నా జర్నీలో భాగమైపోయారు. వీరిద్దరితో నేను గతంలో సూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేశాను. వాళ్ళిద్దరి స్టార్ డమ్ నన్ను స్టార్ డైరెక్టర్ ని చేసింది. చాలా మంది రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య తేడా ఏంటి అని నన్ను అడిగారు. రాంచరణ్ లోతైన నది లాంటి వ్యక్తి. పైకి ప్రశాంతంగా, కామ్ గా కనిపించినా లోపల చాలా పొటెన్షియల్ ఎనెర్జీ ఉంటుంది. 

ఇక తారక్ భయంకర శబ్దంతో జాలువారే జలపాతం లాంటి వ్యక్తి. అంతటి శక్తి అతనిలో ఉంది. రాంచరణ్ అద్భుతమైన నటుడు.. ఆ విషయం అతనికి తెలియదు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు.. ఆ సంగతి అతనికి తెలుసు అంటూ చరణ్, ఎన్టీఆర్ మధ్య తేడా వివరించారు రాజమౌళి. 

చిత్రీకరణ సమయంలో నేను చరణ్, తారక్ ఇద్దరినీ ఎంతో ఇబ్బంది పెట్టాను. తారక్ ఇంట్రో సన్నివేశాలని బల్గెరియా అడవుల్లో చిత్రీకరించాం. అడవుల్లో ఎన్టీఆర్ చెప్పులు లేకుండా పరిగెత్తాడు. అంత కష్టంలోనూ పులి కసిగా పరిగెత్తినట్లు ఉంటుంది ఎన్టీఆర్ పరుగు అని రాజమౌళి తెలిపారు. అలాగే రాంచరణ్ ఇంట్రో గురించి మాట్లాడుతూ.. చరణ్ ఇంట్రో సన్నివేశంలో 2000 మంది జనం కనిపిస్తారు. వారి మధ్యలోకి చరణ్ ని పంపించాం. చమట, దుమ్ము, రక్తం ఇలా ఎంతో కష్టం నడుమ చరణ్ అద్భుతంగా చేశాడు. నా కెరీర్ లో అది ది బెస్ట్ షాట్ అని రాజమౌళి అభివర్ణించాడు. 

మొత్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకులకు అందించబోయే ఎక్స్పీరియన్స్ గురించి జక్కన్న మాట్లాడుతూ.. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు ఊపిరి తీసుకోవడం మరచిపోతారు.. కానీ మీ హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. ట్రైలర్ లో చూపించని ఓ పర్టికులర్ సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. మహాద్భుతంగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ సీన్ గురించి ఇంతకు మించి చెప్పలేను అని రాజమౌళి తెలిపారు. Also Read: Malavika Mohanan: కొంగు జారితే ఇంకేమైనా ఉందా.. హృదయాలు గల్లంతే

Also Read: RRR Mumbai Event: ముంబయి వేదికగా అభిమానులకు ఎన్టీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. కారణమిదే?

click me!