షారుఖ్ ఖాన్ 200 కోట్ల విలువైన ఇల్లు మన్నత్ ఎలా ఉంటుందో తెలుసా? విస్తుగొలిపే విషయాలు

First Published | Sep 13, 2024, 6:03 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మన్నత్ బంగ్లాలో నివసిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆ బంగ్లా లోపల ఎలా ఉంటుందో ఓసారి చూడండి. 
 


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా  మన్నత్ ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. మీకు కూడా కింగ్ ఖాన్ ఇంటిని చూడాలని ఉందా? మన్నత్ బంగ్లా లోపలి ఫోటోలు ఇక్కడ ఉన్నాయి... 
 

షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల సొంత ఇల్లే మన్నత్. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.


షారుఖ్ ఖాన్ నివసిస్తున్న మన్నత్ ముంబైలో ఉంది. ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ (Mannath) అని పేరు పెట్టారు. 
 

గౌరీ ఖాన్ తన భర్త కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు.

షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది.  డ్రెస్సింగ్ రూమ్ నుంచి తమ చెప్పులను పెట్టుకోవడానికి కూడా అందమైన గదిని గౌరీ ఖాన్ నిర్మించారు. 
 

సినిమా ప్రియుడైన షారుఖ్ ఇంట్లో భారీ హోమ్ థియేటర్ (mini theatre) ఉంది. అది చాలా లగ్జరీగా ఉండి, వెల్వెట్ వాల్ డిజైనింగ్ కలిగి ఉంటుంది. థియేటర్ ఎంట్రన్స్ లో షోలే, మొఘల్ ఏ ఆజమ్ సినిమాల పోస్టర్లు ఉన్నాయి. 

డిజైనర్ నియోక్లాసికల్ ఎలిమెంట్స్, ఇటాలియన్ ఆర్కిటెక్చర్, ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అరుదైన కళాఖండాల కలయికతో షారుఖ్ ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ కి రాయల్ లుక్ తీసుకొచ్చారు. ఇది ఆ ఇంటికి ప్రధాన ఆకర్షణ.

షారుఖ్ ఇంట్లోని లివింగ్ రూమ్ చాలా రిచ్ గా ఉంటుంది. డ్రాయింగ్ రూమ్ కి ఎదురుగా లివింగ్ రూమ్ డిజైన్ చేయబడింది. లివింగ్ స్పేస్ (living space) కి రా టచ్ ఇవ్వగా, ఇక్కడి అన్ ఫినిష్డ్ లుక్ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు. 
 

మన్నత్ (Mannat) గురించి మరో ఆసక్తికర విషయం చెబుతా వినండి. మన్నత్ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా తమకు అవసరం లేదని చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి చెందిన మన్నత్ దేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా మారింది.

Latest Videos

click me!