T Rajendar, Simbu
తమిళ సినిమాల్లో వివాదాలకు పేరుపొందిన నటుల జాబితా తీస్తే అందులో నటుడు సింబుకు ప్రత్యేక స్థానం ఉంది. నటీమణులతో ప్రేమ, షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం ఇలా సింబు సినిమాల్లో ఎదుర్కొన్న వివాదాలు కోకొల్లలు. కానీ ఆయనను సినిమాల్లోకి పరిచయం చేసిన ఆయన తండ్రి టీ రాజేందర్ అలాంటి వారేమీ కాదు. సినిమాల్లో మిస్టర్ క్లీన్ అని సర్టిఫికెట్ ఇస్తే అది టీ రాజేందర్‌కే ఇవ్వాలి.
ఎందుకంటే ఆయన అంత జెంటిల్‌మెన్. నేటి కాలంలో మీటూలో ఫిర్యాదు చేస్తున్న నటీమణులు చాలామంది టీ రాజేందర్ లాంటి అద్భుతమైన వ్యక్తిని చూడలేకపోయామని ఆశ్చర్యపోతూ, ప్రశంసిస్తున్నారు. నటీమణులను ముట్టుకుని కూడా నటించరట.
T Rajendar
ఇంకా చెప్పాలంటే తన శ్వాస కూడా నటీమణులపై పడకూడదని భావించే వ్యక్తి. ఇంత మంచి మనిషి కూడా ఒక గాసిప్‌లో చిక్కుకున్నారు.
టీ రాజేందర్ దర్శకత్వంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం 'ఉయిరుల్లవారై ఉషా'. ఆ సినిమా విడుదలైన సమయంలోనే టీ రాజేందర్ గురించి గాసిప్ కూడా వచ్చింది. ఆయన ఆ సినిమాకి 'ఉషా' అని టైటిల్ పెట్టడం వెనుక ఒక ప్రేమ ఉందని, గాసిప్‌లు వచ్చాయి. కానీ ఆ సమయంలో దానిని టీ రాజేందర్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత దానికి తగిన సమాధానం ఇచ్చారు టీఆర్.
అదెప్పుడంటే ఆయన పెళ్లి సమయంలో. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నారని చెప్పబడిన నటి మరెవరో కాదు ఆయన భార్య ఉషానే. టీఆర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రంలోనే ఉషా నటించారు. అప్పటి నుంచే ఆమెను ప్రేమించడం ప్రారంభించిన టీ రాజేందర్, తర్వాత తన ప్రేయసిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే విధంగానే 'ఉయిరుల్లవారై ఉషా' అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా హిట్ అయినట్లే ఆయన ప్రేమ కూడా సక్సెస్ అయింది.
T Rajendar కుటుంబం
ఆ తర్వాత మరే నటితోనూ ఆయన గాసిప్ లు రాలేదు. టీ.రాజేందర్ - ఉషా దంపతులకు కురలరసన్, సిలంబరసన్, ఇలకియా అనే ముగ్గురు పిల్లలు. వీరిలో సింబు చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించి ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
T Rajendar కుటుంబ ఫోటో
అలాగే టీఆర్ మరో కుమారుడు కురలరసన్ కూడా సినిమాల్లో సంగీత దర్శకుడిగా పనిచేశారు. పాండిరాజ్ దర్శకత్వంలో సింబు, నయనతార జంటగా నటించి హిట్ అయిన 'ఇదు నమ్మ ఆలు' చిత్రానికి సంగీతం అందించింది కురలరసనే. ఆ తర్వాత ఆయన పెద్దగా సినిమాల్లో దృష్టి సారించలేదు. అలాగే సింబుకు ఉన్న ఒకే ఒక్క సోదరి ఇలకియాకు పెళ్లయింది. టీఆర్ వారసుల్లో సింబు మాత్రమే ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా తిరుగుతున్నాడు.