`బాహుబలి 3` విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. దీనంతటికి మహేష్‌ బాబే కారణమా?..

Published : May 08, 2024, 12:13 PM ISTUpdated : May 08, 2024, 12:37 PM IST

`బాహుబలి 3` విషయంలో రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కావాల్సిందో చెప్పి షాకిచ్చాడు.  ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు జక్కన్న.  

PREV
16
`బాహుబలి 3` విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. దీనంతటికి మహేష్‌ బాబే కారణమా?..

 రాజమౌళి `బాహుబలి` చిత్రంతో తెలుగు సినిమా స్థాయినే కాదు, ఇండియన్‌ మూవీ స్థాయిని కూడా అమాంతం పెంచేశాడు. ప్రపంచానికి తెలుగు సినిమాలో సత్తా ఏంటో చూపించాడు. నిజానికి ఆయన అనేక బౌండరీలను బ్రేక్‌ చేశాడు. దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన చేసిన సాహసాలు అంతా ఇంతా కాదు, ఇప్పుడు మహేష్‌ బాబు సినిమాతో మరో సాహసం చేయబోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. గ్లోబల్‌ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారు జక్కన్న. 

26

మహేష్‌ బాబుతో రూపొందించబోతున్న సినిమా `ఎస్‌ఎస్‌ఎంబీ29` ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. మరో మూడు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందట. ఈ సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మహేష్‌ కూడా వర్కౌట్‌ చేస్తున్నారు. బాడీ ట్రాన్సఫర్మేషన్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు స్క్రిప్ట్ ఫైనల్‌ చేయడంతోపాటు ఆర్టిస్టులను అన్వేషణ, లొకేషన్‌ హంటింగ్‌ వంటివి జరుగుతుంది. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ బిజీగా జరుగుతుంది. 

36
Bahubali 2

ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. `బాహుబలి 3` ప్రస్తావన తీసుకొచ్చాడు. `బాహుబలి` యానిమేషన్‌ ఫిల్మ్ ని ఓటీటీలో తీసుకురాబోతున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో దీన్ని ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సిరీస్‌గా ఈ `బాహుబలిః క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌`ని ప్రసారం చేస్తారు. ఈ మేరకు రెండు ఎపిసోడ్లని మీడియా కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రాజమౌళి, శోభూ యార్లగడ్డ, డిస్నీ ప్రతినిధులు పాల్గొన్నారు. `బాహుబలి` యానిమేషన్‌ వెర్షన్‌ తీసుకురావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రాజమౌళి. 
 

46

ఈ సందర్భంగా `బాహుబలి 3` ప్రస్తావన వచ్చింది. గతంలోనూ మూడో పార్ట్ ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఎప్పుడు అని చెప్పలేదు. తాజాగా ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నిజానికి ఈ పాటికి `బాహుబలి 3` స్టార్ట్ అయిపోయేదట.
 

56

`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత తాను `బాహుబలి3`నే చేయాలనుకున్నాడట. కానీ మహేష్‌ బాబుతో సినిమా కారణంగా వాయిదా పడిందని తెలిపారు. మహేష్‌ బాబు సినిమా లేకపోతే ఇపాటికే `బాహుబలి 3` ప్రారంభం అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా ఈ మూవీకి సూపర్‌ స్టార్‌ అడ్డు పడ్డాడని చెప్పొచ్చు. 

66

ఇదిలా ఉంటే `మహేష్‌ బాబుతో సినిమా చేయాలనేది ఇప్పటి ఐడియా కాదు, ఇప్పటి కమిట్‌మెంట్‌ కాదు. 13ఏళ్ల క్రితమే ఓ వేదికగా అనౌన్స్ చేశారు రాజమౌళి. నెక్ట్స్ మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. బహుశా అది `బిజినెస్‌మ్యాన్‌` టైమ్‌లోనే జరిగింది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ మూవీ తర్వాత `బాహుబలి3` ఉంటుందని తెలిపారు. మరో రెండేళ్ల తర్వాత ఈ మూవీ రాబోతుందని చెప్పొచ్చు. అనంతరం  `మహాభారతం` సినిమా చేసే అవకాశం ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories