ప్రశాంత్ నీల్, సుకుమార్, కొరటాల శివ, బాలీవుడ్ లో కొందరు దర్శకులు, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, అట్లీ ఇలా కొందరి పేర్లు రాజమౌళికి పోటీగా వినిపిస్తున్నాయి. వీరిలో జక్కన్నకి నిఖార్సైన పోటీ ఇచ్చే డైరెక్టర్ ఎవరు అనేది తేలలేదు. కానీ రాజమౌళి మాత్రమే తనకి అసలైన పోటీ ఎవరో ఆయనే తేల్చేశారు. ఇప్పుడు కాదు కొన్నేళ్ల క్రితమే ఓ దర్శకుడు తనకి పోటీ అవుతాడని రాజమౌళి అంచనా వేశారట. ఇప్పుడు అదే నిజమైంది.