సుకుమార్, రాజమౌళి సినిమాలతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది. రాజమౌళి సినిమాలను అందరు ఇష్టపడుతుంటారు. అయితే సుకుమార్ సినిమాలలో రాజమౌళి కి బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా?
టాలీవుడ్ ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన దర్శకులలో రాజమౌళి తరువాత సుకుమార్ కూడా ఉన్నారు. పుష్ప రెండు సినిమాలతో అయన క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరు దర్శకులు తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళారు. అయితే సుకుమర్ సినిమాలు, రాజమౌళి సినిమాలకు చాలా తేడా ఉంటుంది. ఇద్దరి మేకింగ్ స్టైల్ వేరు.. తీసుకునే కథలు కూడా వేరు.. అయితే సుకుమార్ చేసిన సినిమాల్లో రాజమౌళి కి నచ్చిన సినిమా ఏదో తెలుసా?
25
సుకుమార్ మేకింగ్ స్టైల్ డిఫరెంట్..
ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికంటే భిన్నంగా.. ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసిన దర్శకులలో.. సుకుమార్ కూడా ఒకరు. పుష్ప రెండు సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సుకుమార్. ‘పుష్ప’ సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. కథ, పాత్రల ఎలివేషన్స్, నారేషన్ స్టైల్.. కామన్ ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ వరకూ.. అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో ఇచ్చిన ఎలివేషన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి.
35
రాజమౌళి కి నచ్చిన సుకుమార్ సినిమా?
ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో రాజమౌళి కి బాగా నచ్చిన సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా ఏదో కాదు ‘జగడం’. సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు ఉన్నా.. జగడం మాత్రమే రాజమౌళి కి ఎందుకు ఇష్టమో తెలుసా? ఈ సినిమాలో సుకుమార్ తన బెస్ట్ వర్క్ ఇచ్చాడని రాజమౌళి అభిప్రాయం. జగడం సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఎంతో బాగా ఉంటుందనిఆయన పలు సందర్భాల్లో ప్రశంసించారు. సుకుమార్ సినిమాల్లోని మేకింగ్ స్టైల్, కథనంలో ఉన్న డెప్త్ తనను ఆకట్టుకుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
పుష్ప విజయం తర్వాత సుకుమార్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతోంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబినేషన్‌కు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి కొత్త సినిమాతో ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో చూడాలి.
55
రాజమౌళి- మహేష్ బాబు సినిమా?
ప్రస్తుతం రాజమౌళి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా బిజీలో ఉన్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 2027 సమ్మర్ కు ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయంలో రాజమౌళి ఇంకా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.