The Raja Saab : స్టేజ్ పైనే బోరున ఏడ్చిన మారుతి, ఓదార్చిన ప్రభాస్, రాజాసాబ్ ఈవెంట్ లో అసలేం జరిగింది?

Published : Dec 28, 2025, 08:05 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతీ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది?

PREV
15
ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ది రాజాసాబ్. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈమూవీ ప్రీరిలరీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో అరుధైన సంఘటన ఒకటి జరిగింది. ఈసినిమా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేజ్ పైనే ఏడ్చేశారు. మారుతీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ‘రెబల్ సాబ్.. రెబల్ సాబ్’ అనే లిరిక్ నేనే రాశాను. చాలా మాట్లాడాలని ఉంది, చాలా చెప్పాలని ఉంది. రెబల్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు” అని అన్నారు.

25
కింగ్ సైజ్ కటౌట్

మారుతి మాట్లాడుతూ.. నేను ఈ స్థాయిలో నిలబడడానికి కారణం ఇద్దరే, ఒకరు తన “కింగ్ సైజ్ కటౌట్ ప్రభాస్” కాగా, మరొకరు నిర్మాత విశ్వ గారు. నిర్మాత విశ్వ గారు ఈ సినిమాకు తన జీవితాన్ని పెట్టారు. ఇది ఓ సాధారణ ఫంక్షన్ కాదు, ప్రభాస్‌ను తీసుకొస్తున్నప్పుడు ఆ స్థాయికి తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నాము.. అందుకు తగ్గట్టుగానే.. ఏలోటు లేకుండా చేయగలిగాము. ఒక సారి . ‘ఆదిపురుష్’ షూటింగ్ సమయంలో ముంబై నుంచి కాల్ రావడంతో వెళ్లాను, ఆ సమయంలో ప్రభాస్ రాముడి గెటప్‌లో ఉన్నారు. ఆగెటప్ గురించి మాట్లాడుతూ.. కొద్దిసేపు ఆయనను నవ్వించాను.. నాకు బాగా గుర్తుంది. ప్రభాస్ చాలా నవ్వుకున్నారు. ఇక రెంబల్ స్టార్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. ఆయనకు సౌత్ ఆఫ్రికాలోని మసైబారాలో కూడా అభిమానులు ఉన్నారు. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు.

35
అభిమానులకు ఇంటి అడ్రస్ చెప్పిన మారుతి

స్టార్ డైరెక్టర్ మాట్లాడుతూ.. '' ఈరోజు మేము ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయగలుగుతున్నాము అంటే.. దాని వెనుక దర్శకుడు రాజమౌళి పాత్ర ఎంతో ఉంది, ఈరోజు అలాంటి సినిమాలు వస్తున్నాయంటే ఆయన వల్లే. ప్రభాస్ అభిమానులు, రెబల్స్‌తో పాటు ప్రేక్షకులందరినీ ‘ది రాజాసాబ్’ ఎంటర్టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది... ఒక శాతం కూడా నిరాశ కలిగించినా నా ఇంటికి రండి'' అని మారుతి అడ్రస్ కూడా చెప్పారు. “ప్రభాస్‌ను ప్రేమించే ఎవరికైనా నిరాశ కలిగితే విల్లా నంబర్ 16, కొండాపూర్ ఏరియాలోని కొల్లా లగ్జోరియాకు రండి” అని మారుతి అన్నారు.

45
కన్నీళ్లు పెట్టిన మారుతి..

ఇక మారుతి ప్రసంగం కొనసాగుతుండగానే మరింత ఎమోషనల్ అయ్యారు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. “నాలాంటి మిడ్ రేంజ్ దర్శకుడిని రెబల్ యూనివర్సిటీలో చేర్చుకుని ఈ స్థాయిలో నిలబెట్టారు. నేను రాశాను, నేను తీశాను. కానీ ఆయన మాత్రం లైఫ్ పెట్టేశారు. అన్ని భాషల్లో సక్సెస్ సాధించే పొటెన్షియాలిటీ ది రాజాసాబ్‌లో ఉంది. ప్రభాస్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ.. స్టేజ్ మీదనే ఏడ్చేశాడు మారుతి. దాంతో అక్కడ వాతావరణ ఒక్క సారిగా మారిపోయింది. ఎవరు ఓదార్చినా..మారుతి కన్నీళ్లు ఆగలేదు.

55
మరుతిని ఓదార్చిన ప్రభాస్..

మారుతి కన్నీళ్లు పెట్టినప్పుడు స్టేజ్ మీద మ్యుజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు. ఆయన మారుతీని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఏ ఇష్యూ అయినా.. టిష్యూలా తీసేస్తావు.. నువ్వు ఏడవడం ఏంటీ.. అన్నాడు. మారుతి మాట్లాడుతూ..'' నేను ఎవరైనా చనిపోయినా ఎడవను.. టైమ్ వస్తే ఎవరైనా పోవాల్సిందే కదా.. అని చూసి వచ్చేస్తాను. కానీ ఇప్పుడు ఈ టైమ్ లో ఏడుపు ఆగడంలేదు.. లోపల స్ట్రెస్ అంతా బయటకు వచ్చేస్తోంది. సారీ డార్లింగ్.. ఏడుపు ఆగడం లేదు..'' అని మళ్లీ ఏడవడం మొదలు పెట్టాడు. దాంతో ప్రభాస్ స్వయంగా స్టేజి ఎక్కి అతన్ని ఓదార్చాడు. ‘మూడేళ్ళ కష్టం ఇది’ అంటూ సర్దిచెప్పాడు. ఒక్క సారిగా ప్రభాస్ అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories