మహేష్‌ రాముడిగా సెట్‌ అవుతాడో లేదో డౌట్‌.. `వారణాసి` మూవీకి సూపర్‌ స్టార్‌ కృష్ణని ఫాలో అయిన రాజమౌళి

Published : Nov 16, 2025, 12:12 AM IST

రామాయణంలోని ముఖ్య ఘట్టంతో `వారణాసి` సినిమాని రూపొందిస్తున్న రాజమౌళి. ఇందులో మహేష్‌ రాముడిగా కనిపిస్తారట. కాకపోతే రాముడిగా మహేష్‌ సెట్‌ అవుతాడా అనేది డౌట్‌. 

PREV
18
`వారణాసి` ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌

దర్శకధీరుడు రాజమౌళి `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` ల తర్వాత ఇప్పుడు మరో అద్భుతాన్ని క్రియేట్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన `వారణాసి` పేరుతో మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌, ట్రైలర్‌ లాంట్‌ ఈవెంట్‌ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు.  ఇందులో సినిమా టైటిల్‌ రివీల్‌ చేస్తూ, ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ విజువల్‌ వండర్‌తో, అదిరిపోయే ఎపిసోడ్లతో, డిఫరెంట్ టైమ్‌ పీరియడ్స్ తో పూనకాలు తెప్పిస్తుందని చెబితే అతిశయోక్తి కాదు. దాదాపు నాలుగు టైమ్‌ ట్రావెల్స్ లోకి హీరో జర్నీ చేస్తారని ఇందులో చూపించారు. రామాయణం ఎపిసోడ్‌ని కూడా ఆవిష్కరించారు. ఇందులో రాముడిగానూ మహేష్‌ కనిపిస్తారని తెలిపారు రాజమౌళి.

28
వారణాసి ట్రైలర్‌ లీక్‌ పై రాజమౌళి ఆవేదన

ఇక `వారణాసి` మూవీ విశేషాలను రాజమౌళి పంచుకుంటూ, `తాను దేవుడిని నమ్మను అని, కానీ నాన్న చెప్పినట్టు హనుమంతుడు వెనకాల ఉండి నడిపిస్తే, ఇలా అవుతుందా అని కోపం వచ్చింది. మా ఆవిడ హనుమంతుడిని బాగా నమ్ముతుంది, మరి ఆమె నమ్మితే ఇలా చేస్తాడా?` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజమౌళి. ఎందుకంటే ట్రైలర్‌ ప్రదర్శించే సమయంలో చాలా సమస్య వచ్చింది. అదే సమయంలో ముందుగా లీక్‌ అయ్యింది. వీటిని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఈ కామెంట్స్ చేశారు. తనకు రామాయణం, మహాభారతం అంటే ఇష్టమని, మహాభారతాన్ని సినిమా చేయాలనేది తన డ్రీమ్‌ అని తెలిపారు. 

38
రాముడిగా మహేష్‌ సెట్‌ అవుతాడా అనేది డౌట్‌

ఈ సినిమా కథ రాస్తూ వెళ్లగా అది రామాయణంలోకి వెళ్లిందని, తాను రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని సినిమాగా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అయితే మహేష్‌ బాబు కృష్ణుడిగా సూట్‌ అవుతాడని తెలుసు, కానీ రాముడిగా సెట్ అవుతాడా అనే డౌట్‌ ఉండేది. ఎలా ఉంటాడు అనే అనుమానం ఉండిపోయింది. కానీ ఆయనకు రాముడి గెటప్‌ వేసి లుక్‌ టెస్ట్ చేయగా, మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించిందని, రాముడిగా మహేష్‌ అద్భుతంగా ఉన్నాడని తెలిపారు రాజమౌళి.

48
రాముడిగా తన పరాక్రమం చూపించిన మహేష్‌

మహేష్‌ బాబుని రాముడి గెటప్‌లో షూటింగ్‌ చేస్తుంటే అది గొప్ప ఫీలింగ్‌ అన్నారు. మెయిన్‌ ఎపిసోడ్‌కి సబ్‌ ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు రాజమౌళి. వాటిని తీయడం చాలా కష్టంగా అనిపించిందన్నారు. ఇందులో రాముడిగా మహేష్‌ బాబు తన పరాక్రమాన్ని చూపించారు, దయా హృదయాన్ని చూపించారు, కోపాన్ని ఆవిష్కరించారు. రాముడి పాత్రలో అదరగొట్టారని తెలిపారు. 

58
సూపర్‌ స్టార్‌ కృష్ణ గొప్ప ఏంటో తెలిసింది

ఇక ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ కృష్ణని తలుచుకున్నారు రాజమౌళి. తాను సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్‌కి అభిమానిని అని, ఆయన సినిమాలే చూసేవాడిని అని తెలిపారు. అయితే సినిమాల్లోకి వచ్చాక కృష్ణగారి గొప్పతనం ఏంటో తెలిసిందన్నారు జక్కన్న. ఆయన సినిమాల్లో ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారని, ఎన్నో సవాళ్లతో కూడిన ఆ టెక్నాలజీని ధైర్యంగా మనకి పరిచయం చేశారు, ఆ టెక్నాలజీలో సినిమాలు తీసి తన డేర్‌ని చాటి చెప్పారు. సూపర్‌ స్టార్‌ కృష్ణగారి వల్లే ఇప్పుడు మనం ఆయా ఫార్మాట్స్ లో సినిమా చూస్తున్నామని తెలిపారు. అంతటి సాహసాలు చేసిన కృష్ణగారి తనయుడు మహేష్‌ బాబుతో తాను పనిచేయడం చాలా గర్వంగా ఉందన్నారు.

68
`వారణాసి`తో కొత్త టెక్నాలజీ పరిచయం

సూపర్‌ స్టార్‌ కృష్ణని స్ఫూర్తిగా తీసుకుని `వారణాసి` సినిమాతో తాను మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌(ప్రీమియమ్‌ లార్జ్ స్కేల్‌ ఫార్మాట్‌) లో రూపొందించినట్టు తెలిపారు. బిగ్‌ స్క్రీన్‌లో తెరమొత్తంలో సినిమా ప్రదర్శించేలా దీన్ని తెరకెక్కించామన్నారు. అంతేకాదు ఆర్‌ఎఫ్‌సీలో అలానే ఓ స్క్రీన్‌ని డిజైన్‌ చేసి, అందులోనే ఈ మూవీ ట్రైలర్ ని ప్రదర్శించడం విశేషం.

78
మహేష్‌ బాబులో ఉన్న గొప్ప లక్షణం

ఇందులో మహేష్‌ బాబు గురించి ఒక గొప్ప క్వాలిటీ బయటపెట్టారు రాజమౌళి. ఇప్పుడు మనం సెల్‌ఫోన్‌ లేకుండా ఐదు నిమిషాలు కూడా ఉండటం లేదు. కానీ మహేష్‌ సినిమా సెట్‌కి వచ్చారంటే కారులోనే ఫోన్‌ పెడతారు. మళ్లీ దాన్ని చూడరు. షూటింగ్‌ అయిపోయాక, వెళ్లిపోయే సమయంలోనే మళ్లీ ఫోన్‌ పట్టుకుంటారు.  అప్పటి వరకు మధ్యలో ఎప్పుడూ ఆయన ఫోన్‌ వాడరు, చూడరు. అది చాలా గొప్ప లక్షణం. దాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన్నుంచి తీసుకోవాలి అని తెలిపారు జక్కన్న. 

88
ట్రైలర్‌ లీక్‌పై రాజమౌళి ఎమోషనల్‌

ఇదిలా ఉంటే ఆర్‌ఎఫ్‌సీ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ టెస్ట్ షూట్‌ చేయగా, కొందరు డ్రోన్లతో క్యాప్చర్‌ చేసి లీక్‌ చేశారని తెలిపారు రాజమౌళి. అది చాలా బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే సింపుల్‌గా లీక్‌ చేసినట్టు ఆవేదన చెందారు జక్కన్న. అంతేకాదు, ట్రైలర్ చూపించాక రాజమౌళితోపాటు రమా రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌తోపాటు ఇతర ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఎమోషనల్‌గా కనిపించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories