రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోంది. ఈ మూవీతో జక్కన్న హాలీవుడ్ మార్కెట్ ని సైతం టార్గెట్ గా పెట్టుకున్నారు. సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, గ్లొబ్ ట్రాట్టింగ్, హిందూ పురాణాలు ఈ అంశాలు అన్నీ కలగలిపి విజువల్ వండర్ గా రాజమౌళి వారణాసి చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
25
టైటిల్ గ్లింప్స్ తో భారీ అంచనాలు
టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కోసమే రాజమౌళి ఎంత పెద్ద హంగామా చేశారో చూశాం. అంతర్జాతీయ మీడియాని సైతం పిలిచి రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించారు. టైటిల్ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ 1000 నుంచి 1300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
35
జమౌళి పేరు లేకుండా రిలీజ్ డేట్
రాఈ చిత్రం 2027లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. తాజాగా వారణాసి రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆధ్యాత్మిక నగరం వారణాసిలో కొన్ని హోర్డింగ్స్ దర్శనం ఇస్తున్నాయి. ఆ హోర్డింగ్స్ లో 'IN THEATRES 7 APRIL 2027' అని రాసి ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఆ హోర్డింగ్స్ లో సినిమా పేరు కానీ, దర్శకుడు రాజమౌళి పేరు కానీ, మహేష్ బాబు పోస్టర్ కానీ ఏమీ లేవు. కేవలం రిలీజ్ డేట్ మాత్రమే ఉంది.
అది వారణాసి నగరం కాబట్టి ఆ రిలీజ్ డేట్ వారణాసి మూవీదే అని అంతా భావిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా దీని గురించి ట్వీట్ చేశారు. రాజమౌళి వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, రిలీజ్ డేట్ అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు అని పేర్కొన్నారు.
55
నటీనటులు వీరే
ఇలా సినిమా టైటిల్, ఎలాంటి వివరాలు లేకుండా హోర్డింగ్స్ దర్శనం ఇవ్వడంతో ఇది రాజమౌళి మార్క్ ప్రమోషన్స్ అని అంటున్నారు. మొత్తంగా వారణాసిలో వెలసిన ఈ పోస్టర్స్ తో సరికొత్త చర్చ మొదలైంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.