సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ ఈవెంట్ గ్రాండ్ గా ఉండబోతోంది. భారీ మొత్తానికి ఈ ఈవెంట్ ప్రసార హక్కులని విక్రయించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఏ సినిమాకి అయినా ఫస్ట్ లుక్ కానీ, ఫస్ట్ టీజర్, గ్లింప్స్ కానీ ఎలా రిలీజ్ చేస్తారు ? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పడేసి ఊరుకుంటారు. ఫస్ట్ లుక్, టీజర్ బావుంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం, సినిమాకి బజ్ రావడం జరుగుతుంది. సినిమా బిజినెస్ లెక్కలన్నీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైనప్పుడు బయటకి వస్తాయి. కానీ రాజమౌళి స్థాయి, ఆయన స్టైల్ పూర్తిగా వేరు. మరో రెండు రోజుల్లో మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ ఈవెంట్ అత్యంత భారీ స్థాయిలో జరగబోతోంది.
25
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్
ఈ ఈవెంట్ లో గ్లోబ్ ట్రాటర్ మూవీలో మహేష్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కోసం ఇంత భారీ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్ కోసం 100 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వెయ్యి కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ని జక్కన్న ఫస్ట్ లుక్ ఈవెంట్ తోనే ప్రారంభించినట్లు అర్థం చేసుకోవచ్చు.
35
మైండ్ బ్లోయింగ్ ధరకి ఈవెంట్ టెలికాస్ట్ హక్కులు
ఈ ఈవెంట్ ఎక్స్ క్లూజివ్ గా జియో హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం అవుతుంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ హక్కులని జియో హాట్ స్టార్ కి భారీ మొత్తానికి విక్రయించారు. ఏకంగా ఈ ఈవెంట్ ప్రసార హక్కులకు గాను జియో హాట్ స్టార్ సంస్థ 50 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈవెంట్ కి ఖర్చయ్యే మొత్తం కంటే భారీ లాభాలు దక్కుతున్నాయి. ఇదంతా జక్కన్న మాస్టర్ మైండ్ వల్లే సాధ్యం అని చెప్పొచ్చు.
సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మొన్నటి వరకు ఒక్క అప్డేట్ ఇవ్వలేదు. ఇలా ఈ ఒక్క ఈవెంట్ తో రాజమౌళి తన సినిమాకి పీక్ పబ్లిసిటీ తీసుకురావడం, ఈవెంట్ తోనే లాభాలు మొదలు పెట్టడం జరుగుతోంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట.
55
గ్లోబ్ ట్రాటర్ నుంచి వరుస అప్డేట్లు
ఇప్పటికే గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ ఫస్ట్ లుక్, ప్రియాంక చోప్రా మందాకిని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదే విధంగా ఈ మూవీలో హీరో పాత్ర గురించి వర్ణించేలా శృతి హాసన్ పాడిన సంచారి అనే సాంగ్ ని కూడా వదిలారు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నారు.