రాజ్ తరుణ్ - లావణ్య వివాదంలో మరో కొత్త ట్విస్ట్ .. అసలు ఎవరీ ప్రీతీ?

First Published | Aug 5, 2024, 6:03 PM IST

రాజ్ తరుణ్-లావణ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శేఖర్ బాషా, ప్రీతి అనే ఇద్దరు వ్యక్తుల పేర్లు  తెర పైకి వచ్చాయి. ఎవరీ ప్రీతి అనేది చూద్దాం.. 
 


హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పెళ్లి చేసుకుంటాను అని  తనను నమ్మించి మోసం చేశాడు అని రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో రిలేషన్ లో ఉన్నాడని, అరియనా తో కూడా రాజ్ తరుణ్ కి ఎఫైర్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తమది భార్యాభర్తల బంధం అని వేరే వాళ్ళ మోజులో పడి  తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. రాజ్ తరుణ్ నాకు కావాలి అతన్ని దక్కించుకోవడానికి ఇదంతా చేస్తున్నానంటూ లావణ్య వాదన. 
 

Raj Tarun and Lavanya

మరోవైపు రాజ్ తరుణ్ .. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుంది. ఇల్లీగల్ పనులు చేస్తుంది. ఆమె ప్రవర్తన నచ్చకే దూరంగా ఉంటున్నానని అంటున్నాడు. లావణ్య కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని చెబుతున్నాడు. మాల్వి మల్హోత్రా తో తనకు ఎటువంటి సంబంధం లేదు. లావణ్య ఇదంతా కావాలనే డ్రామా చేస్తుంది అని చెబుతున్నాడు. అంతేకాదు లావణ్య చాలా కాలంగా డ్రగ్స్ తీసుకుంటుందని తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని .. అన్ని విషయాలు లీగల్ గానే తేల్చుకుంటానంటూ రాజ్ తరుణ్ ఆరోపణలు చేశారు. 


Raj Tarun and Lavanya

అయితే రాజ్ తరుణ్ కి మద్దతుగా ఆయన స్నేహితుడు ఆర్ జె శేఖర్ భాషా లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.  రాజ్ తరుణ్ ఇల్లు, డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తుంది అని మీడియా ముందు చెప్పకొచ్చాడు. పలు ఇంటర్వ్యూల్లో, న్యూస్ డిబేట్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల మీడియా ముందు శేఖర్ భాషా ని లావణ్య చెప్పుతో కొట్టింది. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చ అయింది. అయితే తాజాగా లావణ్య - రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. 

Raj Tarun


లావణ్య కి డ్రగ్స్ అలవాటు ఉందని, చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేస్తుందని ఆరోపించాడు. ఈ క్రమంలో తమకు  డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు లావణ్యపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. లావణ్య తమకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ప్రీతీ, ఉదయ్ లు ఇచ్చిన కంప్లైంట్ ని పరిశీలించి నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి  కేసు నమోదు చేయాలా .. వద్దా అనేది డిసైడ్ చేస్తామని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. 
 

Latest Videos

click me!