ఆ మధ్యన కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడి అందరి చేత తిట్టించుకున్నాడు వర్మ. అలాగే వైయస్ జగన ్పార్టీకి సపోర్ట్ గా వ్యూహం, శపథం సినిమాల తీసారు. ఆ పార్టీ పరాజయంతో సైలెంట్ అయిపోయారు . ఆ మధ్యన ప్రేక్షకులే అన్ని నిర్ణయించి సినిమా తీస్తే ఎలా ఉంటుందని యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్టుతో వార్తల్లో నిలిచాడు. అంటే ఆడియెన్సే సినిమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని టెక్నీషియన్లు ఎంచుకోవాలని, ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నవారితో తానే నిర్మాతగా సినిమా తీస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. మరి ఈ కాన్సెప్ట్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ తాజాగా ఒక ఆసక్తికరమైన కామెంట్ తో మన ముందుకు వచ్చాడు ఆర్జీవీ.