‘డ‌బుల్ ఇస్మార్ట్` లో గ్ర‌హంత‌ర వాసి గా అలీ...ఈ ట్రాక్ వెనక స్టోరీ ఇదే ?

First Published | Aug 5, 2024, 4:38 PM IST

 గతంలో అల్లు అర్జున్ తో చేసిన సూపర్ హిట్  ‘దేశ‌ముదురు’ స్క్రిప్టులో అలీ లేడు. 

పూరీ జగన్నాధ్ సినిమాల్లో అలీ కు ఓ సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ తోనే సినిమా సగం సక్సెస్ అయ్యిపోతూంటుంది. అందుకోసం ప్రత్యేకమైన కేర్ తీసుకుని గెటప్ లుక్, భాష, యాస, డైలాగుల అన్ని వెరీటీగా చూసుకుంటాడు. ఓ రకంగా కథపై ఎంత వర్క్ చేస్తాడో ...అంతకు మించి అన్నట్లు అలీ ట్రాక్ లు కనపడుతూంటాయి. అందేకే పూరి సినిమాల్లో అలీ గెటప్స్, కామెడీ ఎవర్‌గ్రీన్‌. అయితే ఈ మధ్యన పూరి సినిమాల్లో అలీ కనపడలేదు. మళ్లీ ఇప్పుడు ఇద్దరికి సక్సెస్ అవసరమైన టైమ్ లో  మరోసారి వీరిద్దరూ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అసలు ఈ సినిమాలో అలీ పాత్ర ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటనేది చూద్దాం. 

రీసెంట్ గా  విడుదలయిన డబుల్ ఇస్మార్ట్  మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇందులో మరోసారి ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలీ నవ్వించబోతున్నారని అర్థమవుతోంది.   ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి అసలు అలీ క్యారెక్టర్ ఏంటి అని ప్రేక్షకులు ఆలోచనలో పడిపోతున్నారు. ఎందుకంటే ట్రైలర్  లో కనపడింది కాసేపే అయినా బాగా నవ్వించాడు అలీ. 


Double iSmart

ఇక ‘డ‌బుల్ ఇస్మార్ట్`లోనూ అలీ ట్రాక్ బాగా పేలింద‌ని ఇన్ సైడ్ టాక్. అయితే ఈ ట్రాక్ ఐడియా ప్రారంభంలో  లేద‌ట‌. సినిమా అంతా పూర్త‌ై రషెష్ చూసుకున్న త‌ర‌వాత అలీ మరీ యాక్షన్ ఓరియెంటెడ్ గా  పరుగెడుతోంది..మధ్యలో రిలీఫ్  ఉండుంటే బాగుంటుంద‌ని భావించిన పూరి, అప్ప‌టి క‌ప్పుడు ఈ ట్రాక్ రాసుకుని షూట్ చేసారని తెలుస్తోంది. పూరికు ఇలా చజేయటం అలవాటే. గతంలో అల్లు అర్జున్ తో చేసిన సూపర్ హిట్  ‘దేశ‌ముదురు’ స్క్రిప్టులో అలీ లేడు. కానీ అప్పుడు రిలీఫ్ కోసమని లాస్ట్ లో  అలీ  పాత్ర‌ని డిజైన్ చేసి యాడ్ చేసారు. ఆ క్యారక్టర్ ట్రాక్ ఓ రేంజిలో క్లిక్ అయ్యింది. ఇప్పటికీ టీవీల్లో ఆ ట్రాక్ చూసి జనం ఎంజాయ్ చేస్తూంటారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డబుల్ ఇస్మార్ట్ లో  అలీని ఓ గ్ర‌హంత‌ర వాసిలా చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అలీ కి రాసిన  మాట‌లు, చేష్ట‌లు థియేటర్ ని ఊపేస్తాయని, తెగ న‌వ్విస్తాయ‌ని చెప్పుతున్నారు. ఇక  ఈ ట్రాక్ కీ క‌థ‌కూ సంబంధం ఉండ‌దు. యాక్ష‌న్ తో సాగిపోతున్న సినిమాకు అలీ కాస్త  రిలీఫ్  క‌లిగిస్తాడ‌ని, థియేట‌ర్ మూడ్ ని మారుస్తాడ‌ని చెబుతున్నారు. 
 

  అలీ మాట్లాడుతూ...‘‘అమెజాన్ ఫారెస్ట్‌లో ఒక భాష ఉంటుంది. ఆ భాషను కనిపెట్టి నా క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు పూరీ జగన్నాధ్. నాకోసం అలాంటి అద్భుతమైన క్యారెక్టర్‌ను సృష్టించినందుకు సంతోషంగా చేశాను. నా కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ముంబాయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంది’’ అంటూ తన స్టైల్‌లో ఈ క్యారెక్టర్ గురించి కామెడీగా వివరించారు అలీ.
 

Ram Pothineni Double ISMART

డబుల్ ఇస్మార్ట్’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అప్పటివరకు చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న రామ్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పుడు అదే సినిమాకు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సీక్వెల్‌తో సిద్ధమయ్యాడు .ఈసారి రామ్ వర్సెస్ సంజయ్ దత్ మధ్య జరిగే యాక్షన్ మాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనుందని ట్రైలర్‌తోనే తెలిసేలా చేశాడు పూరీ జగన్నాధ్. పైగా ‘ఇస్మార్ట్ శంకర్’లాగానే ఈ సీక్వెల్‌లో కూడా మాస్ స్టైల్‌లో, హైదరాబాదీ యాసలో రామ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఆగస్ట్ 15న రామ్ ఫ్యాన్స్ కోసం ‘డబుల్ ఇస్మార్ట్’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు మేకర్స్.

‘కేజీఎఫ్’తో అధిరాగా భయపెట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా ఈ సినిమాతో  టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) - రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)తో అలరించబోతున్నారు.  
 

Latest Videos

click me!