స్వప్న, రుద్రాణి కూడా కావ్య మీద కేకలు వేస్తారు. మీరందరూ ఆగండి తను ఏదో తప్పు చేసినట్లు ఎందుకు అలా నిలదీస్తారు అంటూ అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది చిట్టి. ఆయన కి ఒంట్లో బాగోకపోతే కంగారు పడిపోయాను ఆ కంగారులో నాకు ఫోన్ చేయాలని తోచలేదు అని సంజాయిషీ ఇచ్చుకుంటుంది కావ్య. అయితే మాత్రం ఫోన్ చేసి చెప్పవా..