ఆరోజు కావ్య అక్క, అమ్మ, నాన్న ఎంత చెప్పినా వినిపించుకోలేదు పరిస్థితిని ఇక్కడ వరకు తీసుకొచ్చావు అనుభవించు అంటూ కోప్పడుతుంది. అంతలోనే కావ్య వచ్చి స్వప్నని ఓదారుస్తుంది. ఇప్పటికైనా వాడి నిజస్వరూపం ఏంటో తెలిసింది కదా బుద్ధిగా అమ్మ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో అంటూ సలహా ఇస్తుంది. ఆ సంబంధం కూడా తప్పిపోయింది అంటుంది అప్పు. ఏం జరిగింది అని అడుగుతుంది కావ్య.