ఇంటికి తిరిగి వస్తూ దారిలో కారు ఆపి ఎందుకు నా లైఫ్ లోనే ఇలా జరుగుతుంది. ఆరోజు ఖుషి ని వదిలి వెళ్ళిపోయినప్పుడే ఆదిత్యను కూడా వదిలి వెళ్ళిపోవచ్చు కదా నా బిడ్డ, నా హక్కు అంటూ తీసుకువెళ్ళింది. తీసుకెళ్లి చెత్తకుప్ప మీద పెట్టింది అని బాధపడతాడు యష్. ఇలా జరుగుతుందని తను ఊహించి ఉండదు అంటుంది వేద. లోకంలో పక్షులు పశువులు కూడా పిల్లల కోసం ఆలోచిస్తాయి అలాంటిది మనిషై ఉండి ఆ మాత్రం ఆలోచించదా.