ఇంతలో కనకం అబ్బాయి ఒక్కడే తొక్కుతున్నాడు నువ్వు కూడా మట్టి తొక్కు అనటంతో కావ్య కూడా మట్టి తొక్కుతుంది. ఆ ఇద్దరి జంటని చూసి ఆనందపడతారు కృష్ణమూర్తి దంపతులు. ఇదంతా ఒక వ్యక్తి ఫోటోలు తీస్తాడు. మరోవైపు రాహుల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్ ఫోటోలు తీసిన వ్యక్తి రాహుల్ కి ఫోన్ చేసి మనం డీలింగ్ తర్వాత మాట్లాడుకుందాము ముందు ఫోటోలు పెట్టాను చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.