సరేనమ్మా నువ్వు ఎలాంటి వాడిని చేసుకుంటానని చెప్పినా నాకేమీ అభ్యంతరం లేదు అని విశ్వనాథం చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్. నేరుగా రిషి దగ్గరికి వెళ్లి ప్రేమంటే ఏంటి అని అడుగుతుంది. ప్రేమ అంటే ఇద్దరి మనసులు కలవడం ఒకరి గురించి ఒకరు ఆలోచించటం. అతను ఒక తండ్రిగా బాధ్యతలు తీసుకోవాలి, ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పాలి అలాగే ఆమె ఒక తల్లిలాగా కల్మషం లేని ప్రేమని చూపించాలి అంటాడు రిషి.