బయటికి కోపం ప్రదర్శిస్తున్నా మనసులో నా మీద ప్రేమ ఉంది. ఏదో ఒక రోజు దాన్ని బయటికి తీసుకు వస్తాను అనుకుంటుంది కావ్య. మరోవైపు కళ్యాణ్ అప్పుతో కలిసి అనామిక దగ్గరికి బయలుదేరుతాడు. దారిలో కళ్యాణ్ బండి పాడైపోతుంది. దాన్ని తోసుకుంటూ నడుచుకొని వస్తూ ఉంటారు కళ్యాణ్, అప్పు. అనామికని కలవాలి లేటైపోతుంది ఇప్పుడు ఎలాగా అని తెగ బాధ పడిపోతాడు కళ్యాణ్. ఇలోగా క్యాబ్ ఒకటి వస్తే అప్పుని అక్కడే వదిలేసి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతాడు కళ్యాణ్.