సర్జరీకోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్థస్త్ శాంతి స్వరూప్.. వైరల్ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే...?

Published : Aug 26, 2023, 07:53 AM IST

నవ్వులు పంచే కమెడియన్ల వెనకాల కష్టాలు కూడా ఉంటాయి. ఈ విషయం తాజాగామరోసారి రుజువయ్యింది. జబర్థస్త్ లో నవ్వులు పూయించే లేడీ గెటఫ్ ఫేమ్.. శాంతి స్వరూప్ తన ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటీ..?   

PREV
16
సర్జరీకోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్థస్త్ శాంతి స్వరూప్.. వైరల్ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే...?

జబర్థస్త్ ఖత్తర్నాక్ కామెడీ షో..ఎంతో మంది మారుమూలన  ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను ప్రపంచానికి పరిచయం చేసింది. కడుపుబ్బా నవ్వించే టాలెంట్ ఉంది.. కడుపునిండా తిండి దొరక్క పేదరికంలో మగ్గుతున్న ఆర్టిస్ట్ లను సెలబ్రిటీలను చేసింది. అటువంటివారిలో.. శాంతి స్వరూప్ కూడా ఒకరు. 

26

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోయలో ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. మొదటి నుంచీ ఉన్నవారు కూడా చాలా మంది జబర్థస్త్ ను వీడి వెళ్ళిపోయారు. కాని ఫస్ట్ నుంచి ఈ స్టేజ్ నే నమ్ముకున్నాడు  శాంతి అలియాస్ శాంతి స్వ‌రూప్ . చాలా మంది శాంతి స్వ‌రూప్ అంటే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు గానీ జ‌బ‌ర్ద‌స్త్ శాంతి  అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. 

36

జబర్థస్త్ లో నవ్వులు పూయించే ప్రతీ కమెడియన్ వెనకాల ఓ కష్టంకూడిన కథ దాగుంది. నవ్వుల వెనకాల కన్నీటి కథలు ఎన్నో ఉన్నాయి. ఏమాత్రం మొహమాటపడకుండా.. ఎంత మంది ఎలా అంటున్నా పట్టించుకోకుండా.. ఆర్టిస్ట్ గా తను చేయగలిగిన లేడి గెట‌ప్‌ చేస్తూ వస్తున్న శాంతి స్వరూప్ కు ఓ పెద్ద కష్టప వచ్చి పడింది.  పైకి న‌వ్వుతూ క‌నిపిస్తూ అంద‌రిని న‌వ్విస్తున్న శాంతి స్వ‌రూప్ తన ఇల్లు కూడా అమ్ముకోవలసి వస్తోంది. 

46

ఆ మ‌ధ్య ఎంతో ఇష్ట‌ప‌డి ఓ ఇల్లు కొనుక్కున్నాను అంటూ అత‌డు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అత‌డే స్వ‌యంగా వెల్ల‌డించాడు. అయితే దానికి కారణం తెలిసి నెటిజన్లు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. శాంతి స్వరూప్ అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయించాలట. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో.. ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నాడట. 

56

అమ్మ స‌ర్జ‌రీ కోసం త‌న దగ్గర డ‌బ్బు లేక‌పోవ‌డంతో ఇంటిని అమ్మేస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తెలిపాడు శాంతి స్వరూప్. ఈ విష‌యం త‌న త‌ల్లికి తెలియ‌ద‌ని...ఇంటిని అమ్మేస్తున్న విష‌యం అమ్మ‌కు తెలిస్తే అస్స‌లు ఒప్పుకోద‌ని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నాడు ఆమె కంటే త‌న‌కు ఏదీ ముఖ్యం కాద‌ని చెప్పుకొచ్చాడు.  . ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. 

66

అంతే కాదు శాంతి స్వరూప్ కు ధైర్యం చెపుతున్నారు. మ‌ద్దుతుగా కామెంట్లు చేస్తున్నారు. అధైర్యపడొద్దని, అమ్మగారు త్వ‌ర‌గానే కోలుకుంటారని ధైర్యం చెబుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం గొప్ప‌దంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

click me!

Recommended Stories