క్రేజీ ఫన్ రైడర్ : ‘బాయ్స్ హాస్టల్’రివ్యూ

First Published | Aug 26, 2023, 8:53 AM IST

వార్డెన్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినప్పుడు హాస్టల్ కుర్రాళ్లకి  పెద్ద సమస్య దురౌతుంది. హాస్టల్‌ కుర్రాళ్లు దీన్ని యాక్సిడెంట్‌గా మార్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత టెన్షన్ గా  మారుతుంది. 

Boys Hostel Telugu movie review


తెలుగులో  ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి ఓ సినిమా రిలీజ్ చేసారంటే ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని అర్దమవుతుంది. కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేసారు.  నెల క్రితం వచ్చిన ఈ చిత్రం అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ  చిత్రంలోనూ అదే స్దాయిలో వర్కవుట్ అవుతుందా ..అసలు స్టోరీ లైన్ ఏమిటి..సినిమా తెలుగు వాళ్లకు నచ్చే కంటెంట్ ఉందా?

Hostel Hudugaru Bekagiddare Review

స్టోరీలైన్

అదొక బాయ్స్ హాస్టల్ . చాలా అల్లరి స్టూడెంట్స్ ఉంటున్నారు.  అక్కడ వార్డెన్ (మంజునాథ్ నాయక) చాలా స్ట్రిక్ట్స్..కొంచెం నోటి దూల. తనను తాను మిలిట్రీ నుంచి రిటైర్ అయ్యి వచ్చినట్లుగా చెప్తూంటాడు. అంతేకాదు అక్కడ టీ బాగోలేదనో..మరొకటి ఇబ్బంది అనో గొడవ చెయ్యబోతే తాను మిలిట్రీలో ఉండగా మూడు బుల్లెట్లు దిగినా ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పి భయపెడుతూంటాడు. దాంతో కుర్రాళ్లు వార్డెన్ అవకాసం ఉంటే చంపేయాలన్నంత కోపంతో రగిలిపోతూంటాడు. అయితే ఆ రోజూ రానే వస్తుంది.  ఓరోజు రాత్రి ఆ వార్డెన్ ... ఓ సూసైడ్ నోట్ రాసి అందులో చాలా మంది కుర్రాళ్ల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటాడు.  పీడ వదిలిందని ఆనందపడాలో లేక తమ పేర్లు అందులో రాసి చచ్చాడని టెన్షన్ పడాలో ఆ బోయ్స్ కు అర్దం కాదు. తమ పేర్లు రాసారు కాబట్టి ఖచ్చితంగా తమను పోలీస్ లు అరెస్ట్ చేస్తారని భావిస్తారు. దాంతో ఆ సూసైడ్ నోట్ లో ఉన్న కుర్రాళ్లు తమ సీనియర్స్ ముగ్గురుని రిక్వెస్ట్ చేసుకుని ఆ సూసైడ్ ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ లోగా ఎవరూ ఊహించని  ఓ ట్విస్ట్ పడుతుంది.  ఆ ట్విస్ట్ ఏమిటి... వార్డెన్ శవాన్ని మాయం చేసే  ప్రాసెస్ లో జరిగే ఫన్ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 


hostel hudugaru bekagiddare

విశ్లేషణ

మనకు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది అనే సినిమా వచ్చింది. అందులో షార్ట్ ఫిల్మ్ చేసే క్రమంలో జరిగే ఫన్, కుర్రాళ్ల హంగామా అదిరిపోతుంది. దాదాపు ఇలాంటి ఐడియానే ‘బాయ్స్ హాస్టల్’నేపధ్యంలో తీసుకున్నారు. అయితే ఇక్కడ క్రైమ్ ని ఇంక్లూడ్ చేయటంలో కొత్తదనం వచ్చేసింది. ఆ రకంగా మనవాళ్లే ముందున్నారు. అయితే ఆ వారసత్వాన్ని ఎవరూ కంటిన్యూ చేయలేదంతే. 

ఇక ఓ రాత్రిలో జరిగిన కథను స్క్రీన్ ప్లేలో బోర్ కొట్టకుండా చెప్పటం చాలా కష్టమైన విషయం. అందులోనూ  దాదాపు 500మంది థియేటర్ ఆర్టిస్ట్ లతో కలసి అంతా కొత్త కాస్టింగ్ తో ఈ సినిమాని క్రియేట్ చేశారు. ఈ విషయంలో డైరక్టర్, టీమ్ బాగా సక్సెస్ అయ్యారు. 

Hostel Hudugaru Bekagiddare

అలాగే హాస్టల్ లలో జరిగే అల్లరిని, నిజం అనిపించేలా అచ్చం అలాంటి వాళ్లనే ఎంచుకుని చేయించి  తెరపైకి తీసుకురావటమే  ఇక్కడ మరో సక్సెస్. టీనేజ్ కుర్రాళ్లు ఏదైనా చేసేద్దామనుకునే వాళ్లు...తమ వార్డెన్ చనిపోయాడు..అదీ సూసైడ్ నోట్ లో  తమ పేర్లు రాసి అనేది సినిమాలోకి మనని తీసుకెళ్లే విషయం. ఈ డైరక్టర్ అంతకు ముందు లూసియా కు పనిచేసాడు. ఆ ఎక్సపీరియన్స్ ఇక్కడ పనికొచ్చినట్లు ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా డైరక్టర్ కు ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ ప్రతీ చోటా కనపడుతూనే ఉంటుంది. ఒక్కసారి అతని ప్రపంచంలోకి వెళ్లిపోతే ఎంజాయ్ బాగా చేయగలుగుతాం. అయితే డైలాగులు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల సాగినట్లు అనిపిస్తుంది. లౌడ్ గా ఉంటుంది. అయితే వాటిని తన క్యారక్టరైజేషన్స్ తో దాటగలిగాడు. 

Boys Hostel telugu

ఎప్పుడూ గంజాయి మత్తులో ఊగుతూ క్లాస్ లు పీకే  ముగ్గరు సీనియర్స్ (అందులో డైరక్టర్ ఒకరు), షార్ట్ పిల్మ్ తీయాలనే జీవితాశయం పెట్టుకుని కలలు కనే కుర్రాడు. ఓ అమాయకుడైన జూనియర్, జీసస్ మిరాకిల్స్ చేస్తాడని నమ్మి ప్రతీదాంట్లో అది వెతికే ఓ ఫీల్ గుడ్ క్రిస్ట్రియన్ కుర్రాడు, కులాల గురించి మాట్లాడే మరికొందరు కుర్రాళ్లు, హిందీ తప్పించి లోకల్ భాష రాని ఓ నార్త్ ఇండియన్. వాడికి ఇక్కడ మనవాళ్లంటే చిన్న చూపు. ఎప్పుడూ ఏదో ఒక ప్రొటస్ట్ చేయాలని ఆత్రుతపడిపోయే కుర్రాడు. వాడిని అనుసరించే కుర్రాళ్లు. ముగ్గరు కుర్రాళ్లను మెయింటైన్ చేసే అమ్మాయి, ఓ ఎడిటర్ (తరుణ్ భాస్కర్) ఇలా ఎన్నో పాత్రలు ఈ ప్లాట్ చుట్టూ తిరుగుతూంటాయి. వాటిని నీట్ గా  రాసుకుని ,కన్ఫూజ్ కాకుండా తెరకెక్కించి సక్సెస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు.అదీ కొత్త దర్శకుడు. అయితే సెకండాఫ్ లో లాగ్ లు, రిపీట్ కంటెంట్ సీన్స్  ఇక్కడైనా ఎడిట్ చేసి ఉండాల్సింది.

Boys Hostel telugu

టెక్నికల్ గా..

ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్, డైరక్షన్ టాలెంట్ ప్రధానం. ఆ రెండు విషయాల్లో సక్సెస్సే.  ఇక కాంతారకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, డీవోపీ ఈ చిత్రానికి పని చేశారు..దాంతో ఆ రెండు డిపార్టమెంట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీలేదు. అదరకొట్టేసారు.   సినిమాలో షార్ట్ ఫిల్మ్ చేద్దామని కథ పట్టుకుని తిరుగుతున్న ఓ ఇంజినీరింగ్ కుర్రాడుతో వేరొకరు అంటారు.. "నీ సినిమాలో కథలేదు స్ట్రక్చర్ లేదు," అని ..అయితే డైలాగు అలా పెట్టుకున్నా ఈ సినిమాలో బిగిన్,మిడిల్ ,ఎండ్ స్ట్రిక్టర్ ఫెరఫెక్ట్ గా రాసుకున్నారు. కథ ఉందా అంటే ఉంది..లేదు అంటే లేదు. ఎడిటింగ్ కొన్ని లాగ్ లు తీసేసి ఉంటే ..ధాంక్స్ చెప్పుకుందుము. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..పెద్ద సినిమాలకు ఉన్నట్లు ఉంది. దాదాపు ఒకే హాస్టల్ క్యాంపస్ లో మొత్తం జరుగుతుంది. పెద్దగా ఆ విషయంలో ఖర్చు పెట్టలేదు. కొత్త ఆర్టిస్ట్ లు కాబట్టి అటు బడ్జెట్ సేవ్ అయ్యినట్లే.

Boys Hostel telugu

ఫెరఫార్మెన్స్  లు..

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వార్డెన్ గా వేసిన మంజునాథ్ నాయక. అతను సినిమాని ఒంటి చేత్తో మోసుకు వెళ్లిపోయారు. ఇక షార్ట్ ఫిల్మ్ మేకర్ గా వేసిన ప్రజ్వల్ బిపి, మధ్యంలో వచ్చి హంగామా చేసి వెళ్లిపోయే సీనియర్ పాత్రలో రిషబ్ శెట్టి, గమ్మత్తైన గెస్ట్ రోల్స్ లో రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. 

Boys Hostel telugu

ప్లస్ లు 
బోర్ కొట్టనివ్వని స్క్రీన్ ప్లే,  విట్టీ డైలాగులు 
దర్శకత్వం
వార్డెన్ పాత్ర వేసినతని నటన

మైనస్ లు 

చాలా చోట్ల కంటెంట్ రిపీట్ అవటం
బాగా లౌడ్ గా కంటిన్యూ డైలాగులు 
సెకండాఫ్ లో కొన్ని చోట్ల బాగా లాగినట్లు అనిపించటం

Boys Hostel telugu

 
ఫైనల్ థాట్

ఫన్ ని, టెన్షన్ ని  ఓ ఎక్సప్రెషన్ గా , ఎక్సపీరియన్స్ గా చూపెట్టారు
.అయితే ఒకటే కండీషన్ ...మనం ఆ హాస్టల్ లోకి, ఆ ప్రపంచంలోకి  వెళ్తేనే ఎంజాయ్ చేయగలుగుతాం. మన హాస్టల్ డేస్ గుర్తు తెచ్చుకోగలుగుతాం. లేకుంటే అంతే..

---సూర్య ప్రకాష్ జోశ్యుల
 Rating:2.75

Boys Hostel telugu


తెర వెనుక...ముందు

నటీనటులు : ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్,  తరుణ్ భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు.  
సినిమాటోగ్రఫీ:  అరవింద్ ఎస్ కశ్యప్  
 సంగీతం : బి అజనీష్ లోక్‌నాథ్   
ఎడిటర్:  సురేష్ ఎమ్ 
కథ,మాటలు, దర్శకత్వం:   నితిన్ కృష్ణమూర్తి 
తెలుగు రిలీజ్: అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ 
విడుదల తేదీ: ఆగస్ట్ 26, 2023
 పీఆర్వోవ‌ంశీ-శేఖ‌ర్‌.

Latest Videos

click me!