Raj Nidimoru Wedding Gift to Samantha : అందరు అనుకున్నట్టుగానే సమంత, రాజ్ నిడిమోరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో భూత శుద్ది వివాహం చేసుకున్నారీ జంట. అయితే పెళ్లిరోజే సమంతకు ఓ షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడట రాజ్. ఇంతకీ ఎంటది. ?
చాలా రోజులగా ఫిల్మ్ ఇండస్ట్రీ కోడై కూస్తున్న మాట సమంత రెండో పెళ్లి. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో ఆమె చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో.. వీళ్లద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని అతా అనుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే వారిద్దరు పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. డిసెంబర్ 1 తెల్లవారు జామున కోయంబత్తూరు లోని ఈషా ఆశ్రమంలో.. ప్రియుడు రాజ్ నిడిమోరు ని భూత శుద్ది పద్దతిలో వివాహం చేసుకుంది సమంత. ఆ తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అఫీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడించింది సమంత. దాంతో సమంత రెండవ పెళ్లి చేసుకున్నందుకు ఆమె అభిమానులు ఎంతో సంతోషిస్తూ..శుభాకాంక్షలు తెలియజేసారు. నెటిజన్లు ఈ విషయంలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
24
సమంతకు రాజ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్..
ఇక పెళ్లైన ఫస్ట్ డేనే రాజ్ నిడిమోరు సమంతకు షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడట. సమంత మీద ప్రేమతో.. ఆమె కోసం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక బ్యూటిఫుల్ హౌస్ ను కొన్నాడట. అంతే కాదు ఈ ఇల్లు ఇంతకు ముందే కొని.. సమంతకు చెప్పకుండా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడట. పెళ్లిరోజు ఈ విషయం చెప్పి.. ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మంచి జ్ఞాపకాన్ని అందించాడట రాజ్. పెళ్ళి జరిగిన వెంటనే సమంత చేతిలో తాళాలు ఉన్న గిఫ్ట్ బాక్స్ ను రాజ్ అందించాడని తెలుస్తోంది. అంతే కాదు ఇక నుంచి ఈ జంట ఆ ఇంట్లోనే కాపుర పెట్టబోతున్నట్టు సమాచారం. త్వరలోనే గృహప్రవేశం చేయబోతున్నారట.
34
సమంత, రాజ్ ప్రేమ ఎప్పుడు మొదలయ్యింది?
సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించినప్పుడు వీరి స్నేహం మొదలయ్యింది ఆసిరీస్ ను డైరెక్ట్ చేసిన దర్శకులలో రాజ్ నిడిమోరు కూడా ఒకరు. ఈసిరీస్ తరువాత నాగచైతన్యతో విడాకులు తీసుకుంది సమంత. ఆతరువాత మయోసైటిస్ వ్యాధితో సినిమాలకు దాదాపు ఏడాది గ్యాప్ ఇచ్చింది సమంత. ఈ క్రమంలో సమంతకు రాజ్ అండగా నిలిచినట్టు తెలుస్తోంది. దాంతో వీరి స్నేహం ప్రేమగా మారినట్టు సమాచారం. రాజ్ నిడిమోరు గతంతో పెళ్లై విడాకులు కూడా అయ్యాయి. రాజ్ దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. వీరిద్దరూ చాలా సందర్భాల్లో జంటగా కనిపించడం, బాగా క్లోజ్ గా మూవ్ అవుతుండటం, రాజ్ తో ఉన్న ఫోటోలని సమంత కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో.. ఇండస్ట్రీలో వీరి బంధంపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీరు తమ రిలేషన్ ని అఫీషియల్ చేయాలనుకోవడంతో.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
ఇక సమంత - రాజ్ నిడిమోరు మధ్య ఏజ్ గ్యాప్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సమాచారం ప్రకారం సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. అదే విధంగా డైరెక్టర్ రాజ్ నిడమోరు 1975 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జన్మించాడు. 2025 నాటికి ఇతనికి 51 ఏళ్లు. దీంతో వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 ఏళ్లకు పైనే అని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.