లెజెండరీ నటుడు రాజ్‌కుమార్(Raj kumar) మూడో కుమారుడు, శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) గుండెపోటుకి గురై శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ ఫ్యామిలీని హార్ట్ ఎటాక్ అనే సమస్య వెంటాడుతుందా;? అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలతో కంపేర్ చేస్తూ అభిమానులు, సినీ వర్గాలు సైతం ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
Rajkumar కన్నడనాట సూపర్‌స్టార్‌గా ఎదిగారు. వెలిగారు. కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుల్లో ఆయన ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమని కొన్ని ఏళ్లపాటు ఏలారాయన. కన్నడ కంఠీరవగా, కన్నడ కల్చర్‌కి ఐకాన్‌గా నిలిచారు. విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుని నట సార్వభౌమగా పేరుతెచ్చుకున్న రాజ్‌కుమార్ 77 ఏళ్ల వయసులో గుండెపోటుకి గురయ్యారు. 2006 ఏప్రిల్ 12న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
ఆ తర్వాత 2015లో ఆయన పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్(Shiva Rajkumar) గుండెపోటుకి గురయ్యారు. ఆయన హార్ట్ స్టోక్ కి గురై కోలుకున్నారు. ఎలాంటి ప్రాణపాయం లేకుండా సురక్షింగా బయటపడ్డారు. అయితే చాలా ఆరోగ్యంగా ఉండే Shiva Rajkumar గుండెపోటుకి గురవడం అందరిని ఆశ్చర్యానికి, షాకి కి గురిచేసింది. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, కన్నడ పవర్ స్టార్ Puneeth Rajkumar హార్ట్ ఎటాక్‌కి గురయ్యారు. మార్నింగ్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఆయన హార్ట్ స్ట్రోక్ కి గురయ్యారు. ఆయనకు తీవ్రంగా స్ట్రోక్ రావడంతో తన ఇంటికి సమీపంలోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అభిమానులను తీవ్రమైన విషాదంలో ముంచెత్తారు. అప్పుడు రాజ్‌కుమార్ గుండెపోటుతో చనిపోవడం, శివరాజ్‌కుమార్‌కి కూడా గుండెపోటు రావడం, ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ సైతం హార్ట్ స్ట్రోక్‌తోనే కన్నుమూయడం బాధాకరం.