Puneeth Rajkumar Dead: పునీత్‌ చివరి పోస్ట్ వైరల్‌, శివన్న ఎమోషనల్‌.. జీవిత సత్యాలు..

Published : Oct 29, 2021, 06:54 PM IST

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌రాజ్‌ కుమార్‌ మరణం చిత్ర వర్గాలను తీవ్రంగా కలచివేస్తుంది. ఆయన హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఇప్పుడు పునీత్‌ పెట్టిన చివరి పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

PREV
16
Puneeth Rajkumar Dead: పునీత్‌ చివరి పోస్ట్ వైరల్‌, శివన్న ఎమోషనల్‌.. జీవిత సత్యాలు..

పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar అన్నయ్య శివరాజ్‌కుమార్‌(శివన్న) నటించిన `జై భజరంగీ`(Bhajarangi2) చిత్రం నేడు(శుక్రవారం ) కన్నడ, తెలుగులో రిలీజ్‌ అవుతుంది. దీంతో ఈ సందర్భంగా ఉదయమే పునీత్‌ రాజ్‌కుమార్‌ అన్న శివరాజ్‌కుమార్ కి, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్‌ తెలిపారు. ఇప్పుడితే వైరల్‌ అవుతుంది. పునీత్‌ చివరి పోస్ట్ అంటూ అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. దీనికి ఎమోషనల్‌ కామెంట్లు పెడుతున్నారు. 
 

26

మరోవైపు Puneeth Rajkumar deathతో ఆయన ఫ్యామిలీ కన్నీరుమున్నీరవుతుంది. చాలా హెల్దీగా, ఫిట్‌గా ఉండే పునీత్‌ ఇలా హార్ట్ ఎటాక్‌కి గురి కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర శోకసంద్రంలో మునిగితేలుతున్నారు. పునీత్‌ అన్న శివరాజ్‌కుమార్‌ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మార్నింగ్‌ తమ్ముడు పునీత్‌ పెట్టిన పోస్ట్ ని చూసుకుని ఎమోషనల్‌ అవుతున్నారట. తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. 
 

36

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే పునీత్‌ రాజ్‌కుమార్‌, శివరాజ్‌ కుమార్‌, అలాగే రాక్‌స్టార్‌ యష్‌ కలిసి ఓ స్టేజ్‌పై డాన్సు చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో శివరాజ్ కుమార్‌, యష్‌లతో కలిసి పునీత్‌ చాలా యాక్టివ్‌గా సరదాగా డాన్సు చేస్తూ కనిపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ముందు లేకపోవడం, మనల్ని విడిచి వెళ్లిపోవడంతో అభిమానుల గుండెలు బద్దలైపోతున్నాయి. 

46

పునీత్‌ రాజ్‌కుమార్‌ ఎంతో మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మంచితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప మనిషిని కోల్పోయామంటున్నారు. ఆయన మరణం తీరని లోటని అంటున్నారు. అయితే ఈ సందర్భంగా పునీత్‌ చెప్పిన పలు జీవిత సత్యాలు వైరల్‌ అవుతున్నాయి. 
 

56

`డబ్బు, హోదా, పలుకుబడి ఎన్ని ఉన్నా చావు అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. చావు వచ్చాకా తప్పించుకోలేము. మనకి దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి. పుట్టుకతో ఏమి తీసుకురాము. వట్టి చేతులతో వస్తాం. పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాం. ఈ రోజు ఎలా ఉన్నామనేది ముఖ్యమ`ని పునీత్‌ ఓ సందర్భంలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సైతం వైరల్‌ అవుతుంది. 

66

పునీత్‌రాజ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ కి గురయ్యారు. దీంతో హుఠాహుటిన సమీపంలోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం పునీత్‌ తుదిశ్వాస విడిచారు. అభిమానులు శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తన అద్భుతమైన నటనతో, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో, సేవా కార్యక్రమాలతో, మంచి వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు పునీత్‌. 

related news: puneeth rajkumar death; రియల్‌ పవర్‌స్టార్‌గా పునీత్‌ ఎదగడానికి కారణాలివే.. తెలిస్తే ఫ్యాన్‌ అయిపోతారు..

related news: Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ కి బాగా నచ్చిన తెలుగు పాట..ఆర్జీవీ సినిమా అని గుర్తుపట్టేశాడు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories