Brahmamudi: స్వప్నను కాపాడిన పంతులు.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్ పెళ్ళికొడుకు?

Published : Jun 15, 2023, 04:43 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఆకాశానికి నిచ్చెనలు వేసి బక్క బోర్లా పడిన ఇద్దరు వ్యక్తుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: స్వప్నను కాపాడిన పంతులు.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్ పెళ్ళికొడుకు?

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వేమైనా వస్తువు కొంటున్నావా గ్యారెంటీ అడగడానికి అంటూ రుద్రాణికి చివాట్లు పెడుతుంది అపర్ణ. రాజ్ వాళ్ళు వెతకడానికి వెళ్లారు కదా స్వప్నని తీసుకువస్తారు అప్పటివరకు నువ్వు ఏమీ మాట్లాడకు. ఒకవేళ వాళ్ళు స్వప్నని తీసుకురాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు సీతారామయ్య.

28

 సీన్ కట్ చేస్తే పంతులుగారు ఇంకా రాలేదు అని పంతులుకి ఫోన్ చేస్తాడు కామరాజు. అప్పటికే తన బండి పాడైపోయి ఫ్రస్టేషన్లో ఉంటాడు పంతులు. నువ్వు పదేపదే ఫోన్ చేసావంటే ఇంటికి వెళ్లి చక్కగా తినేసి పడుకుంటాను నీ పెళ్లి నువ్వే చేసుకోవచ్చు అంటాడు పంతులు. అలా చేయకు ఇకమీదట నీకు ఎవరు కాల్ చేయరు నువ్వే తాపీగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కామరాజు.

38

నన్నే బెదిరిస్తావా ఒకసారి ఈ పెళ్లి అయిపోని అప్పుడు నీ సంగతి చూస్తాను అని మనసులో పంతుల్ని తిట్టుకుంటాడు కామరాజు. మరోవైపు ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వటం లేదు మరోవైపు ముహూర్తానికి టైం అయిపోతుంది ఈసారి ఏ బండి వస్తే ఆ బండికి అడ్డంగా నిలబడిపోతాను అనుకుంటూ కావ్య వాళ్ళ బండికి అడ్డంగా నిలబడతాడు పంతులు. కారు ఆపిన తర్వాత కావ్య వాళ్ళని లిఫ్ట్ అడుగుతాడు. వచ్చి కూర్చోమంటుంది కావ్య. తర్వాత దారిలో ఆపుతూ కనిపించిన వాళ్ళని స్వప్న ఫోటో చూపిస్తూ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతుంది కావ్య. ఇదంతా గమనిస్తున్న పంతులు ఎవరిని వెతుకుతున్నారు అంటాడు.

48

జరిగిందంతా చెప్తుంది కావ్య. ఏది అమ్మాయి ఫోటో చూపించు అంటారు పంతులు. ఫోన్లో స్వప్న ఫోటో చూపిస్తుంది కావ్య. పిల్ల మహాలక్ష్మి లాగా ఉంది ఏ రావణాసురుడు ఎత్తుకుపోయాడో ఏంటో అంటాడు పంతులు. మహాలక్ష్మి అన్నారు కదా పంతులుగారు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు రాజ్. మా అక్కని ఏదో ఒకటి అనకపోతే మీరు ఉండలేరు అంటూ కసురుకుంటుంది కావ్య. ఇంతలో పంతులు చెప్పిన అడ్రస్ రావటంతో అతనిని అక్కడ దించేసి వెళ్ళిపోతారు కావ్య వాళ్ళు. ఇంట్లోకి వెళ్లిన పంతులు అక్కడ ఉన్న సెట్టింగ్లు చూసి ఇది బలవంతపు పెళ్లా నేను చచ్చినా చేయను అని వెళ్ళిపోబోతాడు. అతన్ని చుట్టుముట్టి బెదిరించి బలవంతంగా పీటల మీద కూర్చోబెడతారు రౌడీలు.

58

అప్పుడు స్వప్న మోహం చూస్తాడు పంతులు. ఎలాగైనా ఈ అమ్మాయిని రక్షించి వాళ్ళ దగ్గరికి చేరేలాగా చేయాలి అనుకొని రౌడీలని మాయ చేసి స్వప్న కి ఫోన్ ఇచ్చి ఫోన్ చేయమంటాడు. స్వప్న రాజ్ నెంబర్ కి డయల్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన రాజ్ కి మంత్రాలు వినిపించడంతో ముందు కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ పంతులు తెలివిగా నడుచుకొని స్వప్న వాళ్ళు ఉంటున్న అడ్రస్ కామరాజు చేతే చెప్పిస్తాడు.ఈ మాటలు అర్థం చేసుకున్న రాజ్ ఇప్పుడు మనం లిఫ్ట్ ఇచ్చిన పంతులు గారే సప్న పెళ్లి చేయిస్తున్నది అనుకుని నేరుగా స్వప్న పెళ్లి జరుగుతున్న ప్లేస్ కి వెళ్తారు. షాక్ అవుతాడు కామరాజు. 

68

స్వప్న కంగారుగా కావ్య పక్కన చేరుతుంది. రాజ్ ని చితగ్గొట్టమని పురమాయిస్తాడు కామరాజు. అప్పుడు రాజ్ రౌడీలతో మీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా మనం ఎందుకు కొట్టుకోవటం అంటాడు. వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం కదా అన్న వాడికి న్యాయం చేయాలి కదా అంటారు పక్కనున్న రౌడీలు. నేను అంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెప్పి ఆ రౌడీల చేతే కామరాజ్ కి గన్  గురి పెట్టిస్తాడు. నిజం చెప్పు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు రాజ్. ఎప్పటినుంచో నాకు ఆ అమ్మాయి మీద మనసు ఉంది పెళ్లి అయిపోతుందని కంగారులో కిడ్నాప్ చేసి తీసుకు వచ్చేసాను అంటాడు కామరాజు. నమ్మొచ్చా అంటాడు రాజ్. నా మొహానికి అంతకుమించి సీన్ లేదు అంటాడు కామరాజు.

78

సరే అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు కావ్య వాళ్ళు. మరోవైపు స్వప్న వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న కనకం వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఏంటయ్యా వాళ్ళు ఇంకా రాలేదు అని భర్తతో అంటుంది కనకం. ఇదంతా మన కర్మ అంటాడు కృష్ణమూర్తి. కర్మ మీది కాదు మాది అంటుంది రుద్రాణి. తరువాయి భాగంలో పెళ్లి పీటల మీద కూర్చుంటారు రాహుల్, స్వప్న.
 

88

సప్నని పెళ్లి చూపులకి చూడడానికి వచ్చిన డాక్టర్ పెళ్లి కొడుకు స్వప్న కి ఫోన్ చేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తాడు. నువ్వు హ్యాపీగా ఉండాలని నువ్వు చెప్పమనట్లే కడుపుతో ఉన్నట్లు అబద్ధం చెప్పాను అంటాడు. అయితే ఆ ఫోన్ స్వప్న కాకుండా కావ్య రిసీవ్ చేసుకోవడం వల్ల జరిగిందంతా తెలుసుకుని షాక్ అవుతుంది. అందరికీ చెప్పాలనుకుంటుంది.

click me!

Recommended Stories