నంబర్ గేమ్ ఎప్పుడూ ఆసక్తికరమే. టాప్ హీరోల ఫ్యాన్స్ మా హీరో నంబర్ వన్ అంటే కాదు మా హీరో అంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఈ సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువయ్యాయి. కాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ప్రతి నెలా వివిధ పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్స్, సీరియల్, టెలివిజన్ సెలబ్రిటీల మీద సర్వే నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయం ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు.
25
ఆ సంస్థ పేరు ఆర్మాక్స్ కాగా, కొంత మేర క్రెడిబిలిటీ ఉంది. ఆ సంస్థ సర్వే ఫలితాలను బట్టి టాలీవుడ్ టాప్ స్టార్స్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. అంటే ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోగా అవతరించారు. గత కొన్ని నెలలుగా ఆదిపురుష్ మూవీ సందడి నెలకొన్న నేపథ్యంలో ప్రభాస్ నంబర్ హీరోగా ప్రేక్షకులతో ఎన్నుకోబడ్డారు.
35
ఇక సెకండ్ పొజీషన్ రామ్ చరణ్ కి దక్కింది. మెగా హీరో తన ర్యాంక్స్ మెరుగు పరుచుకున్నాడు. ఆ మధ్య చరణ్ ర్యాంక్ టాప్ టెన్ లో ఉండేది. ఇప్పుడు టాప్ ఫైవ్ కి దూసుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ కి మూడో ర్యాంక్ దక్కింది. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్ రెండు, మూడు స్థానాలు పొందారు. మరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ టాప్ ఫోర్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఆయన ఒక ర్యాంక్ కోల్పోయాడు.
45
Mahesh Babu
టాప్ 5 లో చోటు దక్కించుకున్న మరో టాప్ హీరో మహేష్. ఆయనకు ఐదో ర్యాంక్ దక్కింది. పవన్ కళ్యాణ్ టాప్ ఫైవ్ లో లేరు. ఆయనకు ఆరో ర్యాంక్ దక్కింది. అనూహ్యంగా దసరా సక్సెస్ తో నాని దూసుకొవచ్చాడు. చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండలను వెనక్కి నెట్టి ఏడవ ర్యాంక్ రాబట్టాడు.
55
ఇక వరుసగా 8,9,10 స్థానాల్లో చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ నిలిచారు. మే నెల సర్వే ఫలితాల ఆధారంగా టాలీవుడ్ స్టార్ హీరోల పొజిషన్స్ ఇలా ఉన్నాయి. ఆయా హీరోల చిత్రాల విడుదల, వాటి ఫలితాల ఆధారంగా ఈ ర్యాంక్స్ మారుతూ ఉంటాయి.