ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య అందరికీ టీ ఇస్తూ ఉంటుంది. కానీ కావ్యని అందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అపర్ణ కిందకి దిగుతుంది ఆమెకి కూడా టీ ఇస్తుంది కావ్య. ధాన్యలక్ష్మి.. మన ఇంటి పనులు మనమే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం కదా, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇస్తే టీ తీసుకోను అంటూ ఇన్ డైరెక్ట్ గా కావ్యకి చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు నాతో మాట్లాడకూడదని డిసైడ్ అయ్యారు అన్నమాట అనుకుంటుంది కావ్య.