దాదాపు 18 ఏళ్లుగా తమన్నా తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీస్ లో ఎన్నో చిత్రాలు చేశారు. సీనియర్ హీరోయిన్ జాబితాలో పేరు నమోదు చేసుకున్నా.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో వరుస సినిమాలు, సిరీస్ లతో అలరిస్తూ సెన్సేషన్ గా మారుతోంది. ఇంతకీ బ్యూటీ సీక్రెట్ ఏంటని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. తాజాగా ఆ రహస్యాన్ని మిల్క్ బ్యూటీ బయటపెట్టింది.