VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే

Published : Jan 22, 2026, 10:43 PM IST

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో `వీడీ 14` పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. దీన్నుంచి తాజాగా అప్‌ డేట్‌ వచ్చింది. దర్శకుడు అదిరిపోయే వార్త చెప్పాడు. 

PREV
14
రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోన్న విజయ్‌ దేవరకొండ

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ చివరగా `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కమర్షియల్‌గానూ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. దీంతో అభిమానులు కొంత నిరాశతో ఉన్నారు. నిజానికి `గీత గోవిందం` తర్వాత నుంచి విజయ్‌కి సాలిడ్‌ హిట్‌ పడటం లేదు. మధ్యలో `ఖుషి` ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత చిత్రాలు నిరాశ పరిచాయి. ఈ క్రమంలో ఇప్పుడు రెండు అదిరిపోయే చిత్రాల్లో నటిస్తున్నారు విజయ్‌.

24
పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా వీడీ14

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్‌` మూవీ చేస్తున్నారు. దీంతోపాటు రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో `వీడీ14` పేరుతో మరో మూవీ రూపొందుతుంది. వీరి కాంబినేషన్‌లో గతంలో `టాక్సివాలా` వచ్చిన విషయం తెలిసిందే. ఇది డీసెంట్‌ హిట్‌ని అందుకుంది. అయితే పైరసీ ఈ మూవీని చంపేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సాలిడ్‌ హిట్‌ కోసం ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. `వీడీ14` అనేది దీనికి వర్కింగ్‌ టైటిల్‌. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో ఓ పీరియాడికల్‌, హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది.

34
వీడీ14పై దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌కి అభిమాని లేఖ

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌ స్పందించారు. విజయ్‌ దేవరకొండ అభిమాని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఎమోషనల్‌ నోట్‌ ని పంచుకున్నారు. దానికి రాహుల్‌ స్పందించారు. ఇంతకి అభిమాని ఏమని పోస్ట్ చేశాడనేది చూస్తే, `డియర్‌ కామ్రేడ్‌` మూవీ నుంచి విజయ్‌ దేవరకొండ నటించిన ప్రతి సినిమాకూ తన స్నేహితులను, ఫ్యామిలీని తీసుకుని వెళ్తున్నాడట. కానీ వెళ్లిన ప్రతిసారి నిరాశే ఎదురవుతుందని, చాలా కాలంగా తమ హీరోకి సరైన హిట్‌ పడలేదని, కనీసం ఈ సినిమాతో అయినా ఆయన్ని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించమని అభిమాని వేడుకున్నాడు. విజయ్‌కి వరుసగా పరాజయాలు వస్తుండటంతో ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ఫస్ట్ కాపీ రెడీ అయ్యేంత వరకు ఎడిటింగ్‌ దశలోనూ విజయ్‌, రాహుల్‌ పక్కనే ఉండాలని యశ్వంత్‌ అనే విజయ్‌ అభిమాని తన లేఖలో కోరాడు.

44
విజయ్‌ అభిమానులకు గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌ ఇచ్చిన రాహుల్‌ సంకృత్యన్‌

ఆ అభిమాని రిక్వెస్ట్ కు రాహుల్ సంకృత్యన్ స్పందించాడు. ఈ సినిమాకి సంబంధించి గూస్‌బంమ్స్ అప్‌ డేట్‌ ఇచ్చాడు. `మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది. ఇది నా ప్రామిస్` అని తెలిపారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఆయన హామీతో అభిమానులు కాలర్‌ ఎగరేసేందుకు రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న `వీడీ14` సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీకి రిలీజ్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ రావాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories