ఎపిసోడ్ ప్రారంభంలో బాత్రూంలో నుంచి వాటర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. డబ్బులు కావాలని అడుగుతుంది కావ్య. నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావా అంటూ ఆశ్చర్యపోతాడు రాజ్. మీకు నిజాయితీగా ఉంటే నచ్చదు కదా అయినా ఒక్క రూపాయి ఇవ్వండి చాలు అంటుంది కావ్య. సరే ఇస్తాను ముందు నీళ్లు ఇవ్వు అంటాడు రాజ్. అలా కాదు ఇప్పుడే ఇవ్వండి అంటుంది కావ్య.