‘ఆదిపురుష్’ అన్ని థియేటర్లలో ఒక్క సీటును ఖాళీగానే ఉంచబోతున్నారు.. ఎందుకంటే?

First Published | Jun 6, 2023, 10:49 AM IST

రామాయణం ఆధారంగా తెరెక్కబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే చిత్రం రిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఒక్క సీటును ఖాళీగానే ఉంచబోతుండటం ఆసక్తికరంగా మారింది. 
 

హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ పదిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ మునుపెన్నడూ లేనివిధంగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. వినూత్నంగానూ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఈ భారీ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ తో పాటు టీమ్ మొత్తం తిరుమలకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. తాజాగా ప్రభాస్ శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. 

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ మయం అయ్యింది. ఈక్రమంలో ఆదిపురుష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. జూన్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐదు ప్రధాన భాషలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే రాముడి పట్ల, రామాయణం పట్ల భారతీయులకు ఎంతటి గౌరవం, నమ్మకం ఉంటుందో తెలిసిందే. 
 


ఈ సందర్భంగా మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ రిలీజ్ కాబోతున్న థియేటర్లలో ఒక సీటును ఖాళీగానే ఉంచబోతున్నారంట. ఎందుకంటే.. రాముడు ఎక్కడ ఉన్నా.. రాముడికి సంబంధించి ఉత్సవాలు, కార్యక్రమాలు జరిగే చోట హనుమంతుడు కూడా ఉంటాడనే నమ్మకంతో ఇలా చేస్తున్నారంట. ఇంత గొప్ప చిత్రాన్ని వీక్షించేందుకు ఆంజనేయ స్వామి వస్తాడనే సూచకంగా ఒక సీటును ఖాళీగానే ఉంచనున్నారని తెలుస్తోంది. హిందువుల నమ్మకాన్ని ‘ఆదిపురుష్’ మేకర్స్ ఇలా గౌరవించడం ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం తిరుపతిలోని తారాకరామ స్టేడియంలో పెద్ద ఎత్తున జరగబోతోంది. తిరుపతి మొత్తం ఇప్పటికే అయోధ్యను తలపిస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈవెంట్ కోసం తొలిసారిగా ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ ను కూడా ప్రదర్శించబోతున్నారు. 100 డాన్సర్లు, 100 మంది గాయకులు రాముడి భక్తి గేయాలను ఆలపించనున్నారు. లక్షమంది హాజరయ్యేలా వేదికను సిద్ధం చేశారు. చీఫ్ గెస్ట్ గా చినజీయర్ స్వామి హాజరు కాబోతుండటం విశేషం. ఈవెంట్ లో ఆదిపురుష్ రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేసేందుకు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 
 

భారీ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  సీతగా నటించిన నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్త హన్మంతుడిగా కనిపించబోతున్నారు. 
 

చిత్రం రిలీజ్ కు మూడు రోజుల ముందు ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. ఇటీవల మార్పు జరిగినట్టు తెలుస్తోంది. జూన్ 15, 17న మాత్రం ప్రదర్శించనున్నారంట. ఇదిలా ఉంటే ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే థియేటర్ రైట్స్,, డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు అయినట్టు తెలుస్తోంది. దీంతో కలెక్షన్లు అదిరిపోనున్నాయని అంటున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Latest Videos

click me!