దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ చిత్రం 4k వెర్షన్ లో రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మే 9న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.