అయితే ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే—ఇదంతా కేవలం ఊహాగానమే కావచ్చని, రామ్ కేవలం సహనటి పుట్టినరోజు సందర్భంగా మాత్రమే శుభాకాంక్షలు తెలిపి ఉండొచ్చు అని అంటున్నారు. కానీ రామ్ మాత్రం తన పోస్ట్ తో ప్రస్తుతం ఉన్న రూమర్స్ ని మరింతగా పెంచాడు అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్నకింగ్ డమ్ , దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కాంత వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.ఒకవైపు తన గ్లామర్ తో , మరోవైపు డేటింగ్ రూమర్స్ తో భాగ్యశ్రీ ఫుల్ పబ్లిసిటీ కొట్టేస్తోంది.