Jigarthanda Double X Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ 

First Published | Nov 10, 2023, 3:01 PM IST

2014లో విడుదలైన జిగర్ తండ కల్ట్ క్లాసిక్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇమేజ్ మార్చేసిన చిత్రం అది. ఆ టైటిల్ ని వాడుకుంటూ ఆయన చేసిన మరో ప్రయోగం జిగర్ తండ డబుల్ ఎక్స్. లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం నవంబర్ 10న విడుదలైంది... 

కథ


ఎస్సై కావాలని కలలు కనే కృప(ఎస్ జే సూర్య) ఓ హత్య కేసులో జైలుకి వెళతాడు. రాజకీయంగా అండ కలిగిన సీజర్(రాఘవ లారెన్స్) కర్నూలు పట్టణానికి కింగ్ గా ఉంటాడు. సినిమా హీరో అయిన జయకృష్ణ(షైన్ టామ్ చకో) రాజకీయాల్లో కూడా ఎదగాలని చూస్తుంటాడు. జయకృష్ణ సినిమాకు థియేటర్స్ లేకుండా చేసి మరో సినిమాకు థియేటర్స్ దొరికేలా చేసిన ఓ వ్యక్తి మీద జయకృష్ణ కక్ష కడతాడు. అతడు రాజకీయంగా బలంగా ఉంటాడు. దానికి కారణం నలుగురు రౌడీలు. వాళ్ళను లేపేయాలని జయకృష్ణ అనుకుంటాడు. 

ఆ నలుగురు రౌడీలలో సీజర్ ఒకడు. ఈ నలుగురిని చంపే బాధ్యత తమ్ముడు నవీన్ చంద్రకు ఇస్తాడు. ఎస్సై అయిన నవీన్ చంద్ర నలుగురి రౌడీలను చంపేందుకు జైలు శిక్ష అనుభవించిన నలుగురు వ్యక్తులను ఎంచుకుంటాడు. వారిలో కృప ఒకడు. సీజన్ ని చంపేందుకు కృప సిద్ధం అవుతాడు. సినిమా హీరో కావాలని కలలు కంటున్న సీజర్ వద్దకు సినిమా డైరెక్టర్ అంటూ వస్తాడు.. మరి కృప సీజర్ ని చంపాడా? కృప, సీజన్ ప్రయాణం ఎలా సాగింది? సీజర్ హీరో అయ్యాడా? జయకృష్ణ పగ తీరిందా అనేది మిగతా కథ... 
 

Jigarthanda

విశ్లేషణ


ఫిజ్జా, జిగర్ తండ చిత్రాలతో కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ దర్శకుడనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో మూవీ అంటే అంచనాలు ఏర్పడతాయి. జిగర్ తండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జిగర్ తండ షేడ్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో చూడొచ్చు. గ్యాంగ్స్టర్ తో మూవీ చేయడానికి వచ్చే ఒక దర్శకుడు. ఆ దర్శకుడి ఉద్దేశం మాత్రం వేరు అనేది రెండు చిత్రాలకు ఉన్న కామన్ పాయింట్.. 
 



సెకండ్ హాఫ్ కూడా ఆకట్టుకునే సన్నివేశాలతో  మొదలవుతుంది. కథ ఫారెస్ట్ నేపథ్యంలోకి వెళ్ళాక నెమ్మదిస్తుంది. లారెన్స్ పాత్రను మొదట్లో భీకరంగా చూపించి, సెకండ్ హాఫ్ లో పడుకోబెట్టారు. క్లైమాక్స్ లో మరలా చెలరేగినా అప్పటికే ప్రేక్షకులు విసుగెత్తి పోతారు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేదన్నట్లు సాగింది. ఓ సోషల్ ఇష్యూని చర్చించే క్రమంలో కథనం పట్టు తప్పింది. మెసేజ్ ఆసక్తికర సన్నివేశాలతో చెప్పి ఉంటే బాగుండేది. 
 

Jigarthanda Double X

సాంకేతికంగా


దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నుండి జిగర్ తండ రేంజ్ మూవీ మరలా రాలేదు. జిగర్ తండ డబుల్ ఎక్స్ తో ఆ లోటు తీరుస్తాడు అనుకుంటే నిరాశపరిచాడు. తాను చెప్పాల్సిన కథను చెప్పడంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా బీజీఎమ్ ఆకట్టుకుంది. కెమెరా వర్క్ బాగుంది. 
 

Jigarthanda

నటుల పనితీరు


రాఘవ లారెన్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే ఆయన ఆహార్యానికి మించి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. రాఘవ లారెన్స్ మంచిగా నటించిన చిత్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. సూర్య ఎప్పటిలాగే ఇరగదీశాడు. దర్శకుడిగా ఆయన హావభావాలు బాగున్నాయి. లారెన్స్ ని కలిసి తనను దర్శకుడిగా పరిచయం చేసుకునే సీజన్లో ఆయన హైలెట్. 

షైన్ టామ్ చకో, నవీన్ చంద్ర మెప్పించారు. నిమిషా సజయన్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకుంది. 
 

jigarthanda Double X

ఏమి బాగున్నాయి

ఫస్ట్ హాఫ్ 

సూర్య, లారెన్స్ ప్రెజెన్స్ 

బీజీఎమ్ 

ఏమి బాగోలేదు 


సెకండ్ హాఫ్ 
కథనం
ఎడిటింగ్ 
డైరెక్టర్ 

Jigarthanda

ఫైనల్ థాట్

 బ్లాక్ బస్టర్ జిగర్ తండ స్టోరీ లైన్ చుట్టూ మరో కథ, పాత్రలు అల్లి జిగర్ తండ డబుల్ ఎక్స్ తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్. కొంత మేరకు పర్లేదు అనిపించినా అంచనాలు అందుకోవడంలో కార్తీక్ సుబ్బరాజ్  విఫలమయ్యారు. సూర్య, లారెన్స్ యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. 

రేటింగ్: 2.5/5 

నటీనటులు, రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య, షైన్ టామ్ చకో, నవీన్ చంద్ర, నిమిషా సజయన్... 
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్ 
సంగీతం: సంతోష్ నారాయణ్ 
DOP : తిరు 
విడుదల తేదీకి: నవంబర్ 10, 2023... 

Latest Videos

click me!